AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guava : ఈ 3 వ్యాధులు ఉన్నవారు జామపండు అస్సలు తినకూడదు..! ఎందుకో తెలుసుకోండి..

Guava : జామ రుచిగా ఉండే పోషకాలుకలిగిన పండు. ఇందులో చాలా తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు దీనిని వివిధ రకాలుగా తినవచ్చు.

Guava : ఈ 3 వ్యాధులు ఉన్నవారు జామపండు అస్సలు తినకూడదు..! ఎందుకో తెలుసుకోండి..
Guava
uppula Raju
|

Updated on: Aug 05, 2021 | 9:01 PM

Share

Guava : జామ రుచిగా ఉండే పోషకాలుకలిగిన పండు. ఇందులో చాలా తక్కువ కేలరీలు, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు దీనిని వివిధ రకాలుగా తినవచ్చు. జామ పండు మాత్రమే కాదు దాని ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జామ ఆకులను తినడం వల్ల గుండె, జీర్ణక్రియ, రోగనిరోధక వ్యవస్థ బలపడుతుందని అధ్యయనం పేర్కొంది. కానీ ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. జామలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఒక జామలో 112 కేలరీలు, 23 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 9 గ్రాముల ఫైబర్ అతి తక్కువ మొత్తంలో పిండి పదార్థం ఉంటుంది. అయితే ఈ మూడు వ్యాధులు ఉన్నవారు జామ తినడం మానుకోవాలి.

1. గ్యాస్ సమస్య జామపండులో విటమిన్ సి, ఫ్రక్టోజ్ ఉంటాయి. ఈ రెండు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఉబ్బరం వస్తుంది. మీకు కడుపు ఉబ్బరం సమస్యలు ఉంటే, మీరు దీనిని తినకుండా ఉండాలి. ఇందులో 40 శాతం ఫ్రక్టోజ్ ఉంటుంది. ఇది శరీరంలో సులభంగా గ్రహించబడదు. దీని కారణంగా మీ సమస్య పెరగవచ్చు. ఇది కాకుండా నిద్రపోయే ముందు జామపండు తినడం వల్ల కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది.

2. ప్రేగు సిండ్రోమ్‌తో బాధపడుతుంటే తినవద్దు జామలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకాన్ని పోగొట్టి, జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ముఖ్యంగా మీరు ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌తో బాధపడుతుంటే మితంగా తినడం ముఖ్యం.

3. డయాబెటిక్ రోగులు మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో గ్లైసెమిక్ సూచిక తక్కువగా ఉంటుంది. అయితే దీనిని ఆహారంలో చేర్చడంతో పాటు, రక్తంలో చక్కెర స్థాయిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 100 గ్రాముల తరిగిన జామలో 9 గ్రాముల సహజ చక్కెర ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల షుగర్ స్థాయి పెరుగుతుంది. అందుకే మితంగా తినడం ముఖ్యం.

4. జామ తినడానికి సరైన సమయం మీరు రోజంతా ఒక జామ పండు తింటారు. జామ ఒకటి కంటే ఎక్కువ తినకూడదు. వ్యాయామానికి ముందు తరువాత మీరు ఈ పండు తినవచ్చు. రాత్రి సమయంలో ఈ పండును తీసుకోవడం వల్ల జలుబు, కఫం కలుగుతాయి.

Viral video: ఇంటికి గెస్ట్‌‌‌గా వచ్చిన మొసలి.. పలకరిద్దామని చూస్తే ఇంటిపైకెక్కి కూర్చున్నారు..

Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 582 కరోనా కేసుల.. యాక్టివ్ కేసులు, మరణాల సంఖ్య ఇలా

Reliance Jewels: నగలు కొనే వారికి బంపర్ ఆఫర్..! మేకింగ్ ఛార్జీలపై 20 శాతం తగ్గింపు ప్రకటించిన రిలయెన్స్