Kiwi fruit: ఈ పండు గుండెపోటు, బ్రెయిన్‌ స్టోక్ట్స్ నుంచి కాపాడుతుంది..! ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Kiwi fruit: మార్కెట్‌లో మీరు గోధుమ రంగులో ఉండే ఒక పండును చాలాసార్లు చూసే ఉంటారు. డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చినప్పుడు వీటిని కచ్చితంగా తీసుకెళుతారు.

Kiwi fruit: ఈ పండు గుండెపోటు, బ్రెయిన్‌ స్టోక్ట్స్ నుంచి కాపాడుతుంది..! ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Kiwi
Follow us
uppula Raju

|

Updated on: Aug 05, 2021 | 4:52 PM

Kiwi fruit: మార్కెట్‌లో మీరు గోధుమ రంగులో ఉండే ఒక పండును చాలాసార్లు చూసే ఉంటారు. డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చినప్పుడు వీటిని కచ్చితంగా తీసుకెళుతారు. ఈ పండు బయట గోధుమ రంగు, లోపల ఆకుపచ్చగా ఉంటుంది. ఈ పండు పేరు కివీ. ఇది పుల్లగా తియ్య తియ్యగా ఉంటుంది. విటమిన్ సి ఇందులో సమృద్ధిగా లభిస్తుంది. ఇది కాకుండా, విటమిన్ ఇ, విటమిన్ కె, పొటాషియం, ఫోలేట్, ఫైబర్, సోడియం, రాగి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఈ పండు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. ఈ పండు అద్భుతమైన 5 ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. కివిలో యాంటిథ్రోంబోటిక్ ఉంటుంది. ఇది శరీరంలో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్, పల్మనరీ ఎంబోలిజం వంటి సమస్యలు రక్తం గడ్డకట్టడం వల్ల వస్తాయి. అటువంటి పరిస్థితిలో కివి పండు తినడం ద్వారా మీ శరీరం బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు నుంచి దూరంగా ఉంటుంది.

2. కివి తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అంటే LDL తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ అంటే HDL పెరుగుతుంది. ఇది కాకుండా ఈ పండు రక్తపోటును తగ్గిస్తుంది. అధిక BP రోగులకు కివి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

3. ప్రతిరోజూ ఒక గ్రాము విటమిన్-సి తీసుకోవడం ద్వారా ఆస్తమా దాడి ప్రమాదాన్ని తగ్గించవచ్చని శాస్త్రీయ పరిశోధన సూచిస్తుంది. కివిలో విటమిన్-సి పుష్కలంగా లభిస్తుంది. దీని వినియోగం శ్వాస వ్యవస్థకు మేలు చేస్తుంది. ఆస్తమా మరియు శ్వాస సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఈ పండు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

4. ప్రతిరోజూ కివి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక మలబద్ధకం సమస్య కూడా నయమవుతుంది. ఆయుర్వేదం ప్రకారం బరువును తగ్గించుకోవాలనుకునే వారు రోజూ కివి తీసుకోవాలి.

5. కివి తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర, ఇన్సులిన్ మొత్తం సమతుల్యంగా ఉంటాయి. ఈ పండు డయాబెటిక్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది.

Church pastors: గుంటూరు పాస్టర్ల మధ్య గొడవ.. పొలిటికల్ టర్న్. తెరపై ‘అక్రమాల కథా చ్రితం’

Facial Steaming: అందానికి మెరుగులు దిద్దే క్రమంలో ఆవిరిపడుతున్నారా.. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..!

Church pastors: గుంటూరు పాస్టర్ల మధ్య గొడవ.. పొలిటికల్ టర్న్. తెరపై ‘అక్రమాల కథా చ్రితం’