Paneer Benefits: పన్నీర్ తింటే బరువు తగ్గుతారా ? ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకొండి..
పన్నీర్ తినడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఇది జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరచడమే కాకుండా..
పన్నీర్ తినడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలున్నాయన్న సంగతి తెలిసిందే. ఇది జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరచడమే కాకుండా..బరువు తగ్గించడంలోనూ సహయపడుతుంది. అలాగే పిల్లలకు పోషకాహరంగానూ ఉపయోగపడుతుంది. అలాగే శరీరంలో పెరుకుపోయిన కొవ్వును తొలగించడంలోనూ పన్నీర్ ఎక్కువగా సహయపడుతుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్యకరమైన జీవనశైలీ కోసం పన్నీర్ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి శరీరానికి కావాల్సిన పోషకాలను పన్నీర్ అందిస్తుంది. అలాగే ఆకలిని నియంత్రించి బరువు తగ్గడంలోనూ సహయపడుతుంది. పన్నీర్ వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా.
1. 100 గ్రాముల పన్నీర్ కేవలం 72 కేలరీలను మాత్రమే కలిగి ఉంటుంది. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. వంట చేసేటప్పుడు, బార్బీక్యూయింగ్ లేదా హీటింగ్ వంటి పనీర్ టెక్నిక్‌లను ఉపయోగించాలి. 2. ఇక ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 100 గ్రాముల కాటేజ్ చీజ్‌లో 11 గ్రా ప్రోటీన్ ఉంటుందని వెల్లడైంది. దీనిని పూర్తిగా పాలను ఉపయోగించి తయారు చేస్తే అందులో ప్రోటీన్ ఎక్కవగా ఉండడంతోపాటు.. కొవ్వు కూడా అధికంగానే ఉంటుంది. ఇతర పాల వనరులతో పోలిస్తే ఆవు పాలలో కేసిన్ అనే ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఆవు పాలను ఉపయోగించి తయారు చేసిన పన్నీర్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. 3. ఇందులో ఐరన్ లెవల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే పన్నీ్ర్ శరీరంలోని పిండి పదార్థాలను సులభంగా వేరు చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు పిండి పదార్థాలను తక్కువగా ఉండే ఆహరం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆవు పాలను ఉపయోగించి చేసిన 100 గ్రాముల పన్నీర్లో 1.2 పిండి పదార్థాలు ఉంటాయి. 4. అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలను మీరు ఎక్కువగా తిన్నప్పుడు.. పన్నీరు మీ బరువు తగ్గించడంలో భాగంగా కొవ్వును బర్న్ చేస్తుంది. 5. ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది. అందుకే ఇది దంతాలు, ఎముకలను బలంగా ఉంచడంలో సహయపడుతుంది. దాదాపు 100 గ్రాముల పనీర్‌లో 83 గ్రా కాల్షియం ఉన్నట్లు గుర్తించారు. ఇది మన శరీరానికి అవసరమైన దానికంటే 8 శాతం ఎక్కువ. బరువు తగ్గించడమే కాదు.. జీవక్రియను పెంచడంలో కూడా పనీర్ సహాయపడుతుంది.
Also Read: Mosambi Benefits: మోసంబి జ్యూస్‌తో ఎముకలకు బలం.. జుట్టు సమస్యలకు చెక్.. ఇంకా మరెన్నో ప్రయోజనాలు..
Monsoon Health Tips: వర్షాకాలంలో తులసి కషాయం తాగితే రోగాలు మటాష్.. ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా.