Facial Steaming: అందానికి మెరుగులు దిద్దే క్రమంలో ఆవిరిపడుతున్నారా.. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..!

Facial Steaming: ఆవిరి పట్టడం అనేది ఎప్పటినుంచో ఉన్నా.. కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి బాగా ప్రభుత్యం పొందింది. అయితే ఆవిరి కోవిడ్ ను నివారించడం కోసం ఇప్పుడు పడుతున్నా నిన్నా మొన్నటి వరకూ..

Facial Steaming: అందానికి మెరుగులు దిద్దే క్రమంలో ఆవిరిపడుతున్నారా.. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..!
Facial Steaming
Follow us
Surya Kala

|

Updated on: Aug 05, 2021 | 3:49 PM

Facial Steaming: ఆవిరి పట్టడం అనేది ఎప్పటినుంచో ఉన్నా.. కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి బాగా ప్రభుత్యం పొందింది. అయితే ఆవిరి కోవిడ్ ను నివారించడం కోసం ఇప్పుడు పడుతున్నా నిన్నా మొన్నటి వరకూ ఆవిరిని జలుబు చేసిన సమయంలో పట్టేవారు.. లేదంటే ముఖానికి ఫేషియల్ చేసుకునే సమయంలో ఆవిరి పడతారు. అయితే ఆవిరి అందం కోసం పట్టినా.. దగ్గు, జలుబు సమయంలో పట్టినా తగినంత సమయంలో మాత్రమే పట్టాలి.. మరి ఈ ఆవిరి ఎంతసేపు పట్టాలి ? ఎలా పట్టాలి ? అసలు ఆవిరి పట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటనేది తెలుసుకుందాం..

అందానికి మెరుగులు దిద్దే క్రమంలోనూ అప్పుడప్పుడూ ఆవిరిపడుతుంటాం. అయితే ముఖచర్మం చాలా సున్నితమైంది. కనుక ఆవిరి పట్టేసమయంలో ఆవిరిని దగ్గరనుంచి పట్టకూడదు. తగినంత దూరం నుంచి ఆవిరి పట్టాలి. లేదంటే ముఖం ఆ వేడికి కందిపోతుంది. అలాగే ఎక్కువ సమయం ఆవిరిని పట్టకూడదు.. ఎక్కువ సేపు ఆవిరి పడితే చర్మంలోని నూనె గ్రంథులు పొడిబారిపోతాయి. దీంతో చర్మం పొడిబారి ముడతలు పడే ప్రమాదం ఉంది. అంతేకాదు చర్మం సహజత్వం, సున్నితత్వాన్ని కోల్పోయే ప్రమాదముంది.

ఆవిరి పట్టిన వెంటనే ముఖాన్ని గట్టిగా తుడవకూడదు. మెత్తని వస్త్రంతో సున్నితంగా తుడవాలి. ఆవిరి పట్టిన తరువాత క్లీన్సర్‌ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీంతో పోర్స్‌లో ఉన్న మలినాలు తొలగిపోతాయి. ఆవిరి పట్టిన అనంతరం చర్మంలోని నూనె గ్రంథుల్లో ఉండే నూనె బయటకు వచ్చేయడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. చర్మం మృదువుగా మారాలంటే మాయిశ్చరైజర్‌ తప్పనిసరిగా అప్లై చేయాలి

Also Read: Tokyo Olympics 2021: భారత రెజ్లర్ రవిని గట్టిగా కొరికిన కజకిస్తాన్ ఆటగాడు.. క్రీడాస్ఫూర్తి విరుద్ధమంటూ సెహ్వాగ్ మండిపాటు