Andhra Pradesh: సీతానగరం అత్యాచారం కేసులో ఎట్టకేలకు పురోగతి.. పోలీసుల అదుపులో కీలక నిందితుడు..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం అత్యాచారం కేసులో పోలీసులు..

Andhra Pradesh: సీతానగరం అత్యాచారం కేసులో ఎట్టకేలకు పురోగతి.. పోలీసుల అదుపులో కీలక నిందితుడు..!
Arrest
Follow us
Shiva Prajapati

| Edited By: Balaraju Goud

Updated on: Aug 06, 2021 | 10:33 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం అత్యాచారం కేసులో పోలీసులు ఎట్టకేలకు పురోగతి సాధించారు. గురువారం తెల్లవారుజామున ప్రకాశం జిల్లాలో ఇద్దరు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిందితుడిని గుంటూరు అర్బన్‌ పరిధిలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో ఉంచి విచారిస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ కేసులో నిందితుడు షేర్‌ కృష్ణానా? వెంకటరెడ్డా? అనేది తెలియాల్సి ఉంది. ఒంగోలులో తిష్టవేసిన పోలీసులు.. 30 రోజుల పాటు వివిధ వేషధారణలతో యాచకుల దగ్గర్నుంచి.. హిజ్రాలను, సమోసాలు అమ్ముకునే వారిని, రైల్వే ట్రాక్‌ల పక్కన చెత్త ఏరుకునే వారిని విచారిస్తూ ఎట్టకేలకు ఒంగోలు ఫ్లై ఓవర్‌ కింద సేదదీరుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండో నిందితుడు కూడా ఒంగోలు పరిసర ప్రాంతాల్లోనే ఉన్నట్టు సమాచారం రావడంతో గుంటూరు అర్బన్‌ పోలీస్ స్టేషన్‌ నుంచి వెళ్లిన పలు బృందాలు.. ఒంగోలు రైల్వే ట్రాక్‌లు, చెన్నై రైల్వే మార్గంలోని ప్రధాన పట్టణాల్లో, గ్రామాలతో పాటు ఇతర ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.

తాడేపల్లి పరిధిలోని సీతానగరంలో పుష్కరఘాట్ వద్ద జూన్ 19వ తేదీన రాత్రి వేళ యువతిపై దుండుగుల అత్యాచారానికి పాల్పడ్డారు. నదీతీరాన సేద తీరుతున్న ప్రేమ జంటపై దాడి చేసిన దుండగులు.. ప్రియుడిని తాళ్లతో కట్టేశారు. ఆ తరువాత యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. దుండగుల దాడిలో యువతి అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో వారు అక్కడి నుంచి ఉడాయించారు. కాగా, మరుసటి రోజు బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్నారు. యువతిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. బాధిత యువతికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. స్వయంగా హోంమంత్రి సుచరిత.. బాధిత యువతిని కలిసి రూ. 5 లక్షల పరిహారం అందజేశారు.

Also read:

Kochi Teen: వ్యాయాయం చేస్తూ 10 అంతస్తుల భవనంపై నుంచి పడిపోయింది.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. అనారోగ్యంతో కూతురు మృతి.. అదితట్టుకోలేక..

చాణక్య నీతి: మీరు కెరీర్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..