AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. అనారోగ్యంతో కూతురు మృతి.. అదితట్టుకోలేక..

Bhadradri Kothagudem: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తె మరణాన్ని తట్టుకోలేక.. దంపతులు..

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. అనారోగ్యంతో కూతురు మృతి.. అదితట్టుకోలేక..
Kothagudem Couple
Shiva Prajapati
|

Updated on: Aug 06, 2021 | 10:52 AM

Share

Bhadradri Kothagudem: తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుమార్తె మరణాన్ని తట్టుకోలేక.. దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన బూర్గంపాడు మండలం కేటీపీఎస్ పంప్ హౌస్ వద్ద చోటు చేసుకుంది. వీరి మృతికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఈసిఐఎల్‌కు చెందిన దంపతులు పమ్మి హేమలత-లక్ష్మణచారి దంపతులు. వీరికి ఒక కూతురు ఉంది. అయితే, కొద్ది రోజుల క్రితం వారి కూతురు అనారోగ్యంతో కన్నుమూసింది. దాంతో వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ క్రమంలోనే పది రోజుల క్రితం పాల్వంచలోని బంధువుల ఇంటికి వచ్చారు దంపతులు. అయితే, కూతురు మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఈ దంపతులు.. గురువారం నాడు సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయారు.

దాంతో హేమలత తమ్ముడు వేమన కుమార్.. పాల్వంచ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వారి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హేమలత-లక్ష్మణచారి కోసం గాలింపు చేపట్టారు. ఇంతలోనే బ్యాడ్ న్యూస్ అందింది. ఈ దంపతులిద్దరూ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బూర్గంపాడు మండలం కేటీపీఎస్ పంప్‌ హౌస్ వద్ద గోదావరి నదిలో రెండు మృతదేహాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. మృతులిద్దరూ హేమలత-లక్ష్మణచారి గా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

చాణక్య నీతి: మీరు కెరీర్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..

Telangana: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేడు.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్..

Viral Video: వధువు చుంబనం.. వరుడు ఢమాల్.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న లవ్లీ వీడియో..

Follow Us
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..
కలలో పాము కరిచినట్లు వస్తోందా? అయితే లైట్ తీసుకోవద్దు..
సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా?ఇలా చేశారంటే, ఖర్చు లేని స్పీడ్
సీలింగ్ ఫ్యాన్ గాలి రావడం లేదా?ఇలా చేశారంటే, ఖర్చు లేని స్పీడ్
బేకరీ స్టైల్ పిజ్జా టోస్ట్.. ఓవెన్ లేకుండా పెనంపైనే ఇలా చేసేయండి
బేకరీ స్టైల్ పిజ్జా టోస్ట్.. ఓవెన్ లేకుండా పెనంపైనే ఇలా చేసేయండి
ప్రతి కుర్రాడిని ఏడిపించేసింది. చంచల పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
ప్రతి కుర్రాడిని ఏడిపించేసింది. చంచల పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..
ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్
ఓటీటీలో ధురంధర్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్
పెద్ది‌తో పాన్ ఇండియా రికార్డుల వేటలో రామ్ చరణ్
పెద్ది‌తో పాన్ ఇండియా రికార్డుల వేటలో రామ్ చరణ్