చాణక్య నీతి: మీరు కెరీర్‌లో ఉన్నత శిఖరాలను చేరుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ విషయాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు..
Acharya Chanakya: ఆచార్య చాణక్య గొప్ప పండితుడు. ఆయన రాజనీతి, ఆర్థిక శాస్త్రం, వ్యవసాయం, సామాజిక విధానాలు, జీవన విశేషాలు మొదలైన
Acharya Chanakya: ఆచార్య చాణక్య గొప్ప పండితుడు. ఆయన రాజనీతి, ఆర్థిక శాస్త్రం, వ్యవసాయం, సామాజిక విధానాలు, జీవన విశేషాలు మొదలైన వాటిలో నిష్టాతులుగా పరిగణించబడ్డారు. నంద వంశాన్ని కూల్చడంలో, మౌర్య సామ్రాజ్య స్థాపనలో ఆచార్య చాణక్యుడు కీలక పాత్ర పోషించారు. నేటి ఆధునిక కాలంలో కూడా, ఆచార్య చెప్పిన విధానాలు ప్రజలకు చాలా ఉపయుక్తంగా ఉంటున్నాయి. చాణక్య నీతి శాస్త్రంలో, ఆచరణాత్మక జ్ఞానానికి సంబంధించిన అనేక అంశాలను పేర్కొన్నారు. వాటిని అర్థం చేసుకుని ఆచరించిన వారు.. తమ జీవితంలో ప్రతీదాంతో విజయాన్ని, ఆనందాన్ని ఆస్వాదిస్తారు. ఇక మీరు మీ కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకుంటే చాణక్య నీతిలో పేర్కొన్న కొన్ని విధానాలను తప్పక పాటించాలి..
1. మీరు మీ ఉద్యోగ-వ్యాపారంలో విజయం సాధించాలనుకుంటే, ముందుగా క్రమశిక్షణ కలిగి ఉండాలి. మీరు మీ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించాలి. మీరు మీ పని పట్ల నిజాయితీగా, క్రమశిక్షణతో చేయలేకపోతే.. మీ ఆశయం ఎప్పటికీ నెరవేరదు. విజయానికి మొదటి సూత్రం క్రమశిక్షణ, నిజాయితీ.
2. జీవితంలో ఏదైనా సాధించాలంటే రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. అందుకే.. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు వైఫల్యం గురించిన భయాన్ని మనస్సులో అస్సలు ఉంచుకోవద్దు. పూర్తి సన్నాహంతో సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం భవిష్యత్తులో ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.
3. మధురంగా మాట్లాడేవారు, మంచిగా ప్రవర్తించేవారు, ఉద్యోగంలో త్వరగా ఉన్నత స్థాయిని అందుకుంటారు. వ్యాపారంలో కూడా చాలా లాభం పొందుతారు. కఠినంగా మాట్లాడే వారు.. ఎంత మంచి విషయాలు చెప్పినా.. అవి పనికిరాకుండా పోతాయి. అందుకని మీరెప్పుడూ మంచిగా ప్రవర్తించండి. మంచి మాటలే మాట్లాడండి. అందరితోనూ స్నేహపూర్వకంగా ఉండండి.
4. మీరు కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటే.. ఒంటరిగా సాధించాలని అస్సలు భావించకండి. పెద్ద పెద్ద కలలు సహకారంతోనే నెరవేరుతాయి. కాబట్టి కలిసొచ్చే ప్రతీ ఒక్కరినీ మీ వెంట తీసుకెళ్లండి. వారి సామర్థ్యానికి అనుగుణంగా పనిని కేటాయించడి. ఆ తరువాత మీరే విజయం సాధిస్తారు. అని చాణక్య తన నీతి శాస్త్రంలో చెప్పుకొచ్చారు.
Also read:
Telangana: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేడు.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్..
Viral Video: వధువు చుంబనం.. వరుడు ఢమాల్.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న లవ్లీ వీడియో..