Telangana: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేడు.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్..

Telangana: తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికులు, ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేడు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..

Telangana: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేడు.. నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్..
Kcr
Follow us

|

Updated on: Aug 06, 2021 | 6:58 AM

Telangana: తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికులు, ఉద్యమకారులు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి నేడు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. జయశంకర్‌ను స్మరించుకున్నారు. తెలంగాణ స్వరాష్ట్ర స్వాప్నికుడుగా, ఉద్యమ భావజాలవ్యాప్తికోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ జయశంకర్.. తెలంగాణ జన హృదయాల్లో సదా నిలిచివుంటారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనకోసం చేసిన త్యాగపూరిత సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. ఆయనకు నివాళులర్పించారు. సబ్బండ వర్గాల సమగ్రాభివృద్ది కోసమే తెలంగాణ స్వరాష్ట్రం అని తెలిపిన జయశంకర్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నదని చెప్పారు.

రాష్ట్రాన్ని సాధించిన ఏడేండ్ల అనతికాలంలోనే సాగునీటి రంగం, వ్యవసాయరంగం, వంటి పలు మౌలిక భౌతిక రంగాలను తీర్చిదిద్దుకుంటూ వస్తున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. అదే వరుసలో సకల జనుల సమున్నతాభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం, సామాజిక ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. మిషన్ కాకతీయ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు, రైతుబంధు నుంచి దళితబంధు వరకు అనేక వినూత్న పథకాలను అమలు చేస్తుందన్నారు. ఆర్థిక సామాజిక రంగాల్లో అభివృద్ధిని సాధించి ఆత్మగౌరవంతో దళిత బహుజన సమాజం తలఎత్తుకుని తిరిగే విధంగా, తెలంగాణలో సమ సమాజ స్థాపన దిశగా, బంగారు తెలంగాణ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిషలు కృషి చేస్తుందనన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ కలలుగన్న తెలంగాణ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతామని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.

Also read:

Telangana: ‘తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి’.. యువతకు ఆదర్శంగా కరీంనగర్ యువకుడు..

AP SSC Results: నేడే టెన్త్ క్లాస్ రిజల్ట్స్.. ఫలితాలను చెక్ చేసుకోండిలా..

Silver Price Today: దిగి వచ్చిన వెండి ధరలు.. దేశీయంగా ప్రధాన నగరాల్లో ఎంత ధర ఉందంటే..!