Silver Price Today: దిగి వచ్చిన వెండి ధరలు.. దేశీయంగా ప్రధాన నగరాల్లో ఎంత ధర ఉందంటే..!
Silver Price Today: భారతదేశంలో బంగారం, వెండికి అత్యంత విలువ ఇస్తుంటారు. ధరలు పెరిగినా.. కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. సిల్వర్ విషయంలో కూడా మహిళలు..
Silver Price Today: భారతదేశంలో బంగారం, వెండికి అత్యంత విలువ ఇస్తుంటారు. ధరలు పెరిగినా.. కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. సిల్వర్ విషయంలో కూడా మహిళలు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం దేశీయంగా బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. దేశీయంగా పలు ప్రాంతాల్లో కిలో వెండిపై రూ.400 వరకు తగ్గుముఖం పట్టగా, కొన్ని ప్రాంతాల్లో రూ.800 వరకు తగ్గింది. మొత్తం మీద దేశీయంగా పరిశీలిస్తే కిలో వెండిపై వెయ్యి రూపాయల లోపు తగ్గింది.
ఇక ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, చెన్నైలో రూ.72,300 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, కోల్‌కతాలో రూ.67,600 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.67,600 ఉండగా, కేరళలో రూ.67,600 ఉంది. ఇక హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.72,300 ఉండగా, విజయవాడలో రూ.72,300 వద్ద కొనసాగుతోంది.