Telangana: ‘తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి’.. యువతకు ఆదర్శంగా కరీంనగర్ యువకుడు..
పెద్ద చదువులు చదివితే పెద్ద కొలువు వస్తదని ఎంతో మంది యువత ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు మారిన
పెద్ద చదువులు చదివితే పెద్ద కొలువు వస్తదని ఎంతో మంది యువత ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు మారిన ఉద్యోగ నోటిఫికేషన్లు రాక.. పోటీ పరీక్షలు రాసినా.. అర్థంకానీ ఫలితాల మధ్య యువత కొట్టుమిట్టాడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గొప్ప చదువులు చదవి.. ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సంపాదించి తమకు అండగా నిలడతారనుకున్న పిల్లలు తమ కళ్ల ముందే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం ఆ తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతం. కొందరు పట్టణాల్లో చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తుండగా.. మరికొందరు ఊళ్లోనే ఉంటూ చిన్న చితక పనులు చేసుకుంటున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి విసిగిపోయిన ఆర్. నరసింహ ఏకంగా తనే స్వయం ఉపాదిని ఏర్పచుకున్నాడు. తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి పేరుతో కరీంనగర్లో మిర్చి బండి పెట్టి యువతకు ఆదర్శంగా మారాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకెలితే.. కరీంనగర్ ముకరంపురలోని దంగర్వాది స్కూల్ సమీపంలో నగరానికి చెందిన ఆర్. నరసింహ అనే యువకుడు తెలంగాణ నిరుద్యోగి మిర్చి బండి పేరుతో మిర్చి బండి ఏర్పాటు చేసి స్వయంగా వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. డిగ్రీ పూర్తిచేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూసిన ఆ యువకుడు సంవత్సరాలు గడుస్తున్న ఎలాంటి ప్రకటనలు రాకపోవడంతో ఇతర ఉద్యోగాలను పొందేందుకు సాంకేతిక విద్య ఐటీఐ పూర్తి చేశాడు. సంవత్సరం గడిచిన ఉద్యోగం లభించలేదు. దీంతో విసిగిన ఆ యువకుడు మిర్చి బండి వ్యాపారం మొదలు పెట్టాడు. ప్రారంభంలో 10 ప్లేట్లు అమ్మకం కాగా.. మిర్చీల వ్యాపారం రోజు రోజుకీ అభివృద్ధి చెంది.. ప్రస్తుతం 250 నుంచి 300 ప్లేట్ల అమ్మకానికి చేరింది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తూ.. తనతోపాటు.. మరో నలుగురికి ఉపాధిని కల్పిస్తున్నాడు. అతని దగ్గర పనిచేస్తున్న యువకులు కూడా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారే కావడం గమనార్హం. వారికి రోజుకు రూ. 300 నుంచి రూ. 400 వరకు అందచేస్తున్నట్లుగా తెలిపాడు. ఇక అన్ని ఖర్చులు పోనూ.. రోజుకు రూ. 1000 నుంచి 1500 వరకు మిగులుతున్నాయట. ఉద్యోగాలు రాక ప్రాణాలు తీసుకునే ఎంతో మంది యువతకు నరసింహ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Also Read: TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల డెడ్ లైన్.. ఇవాళ జీతాలు ఇవ్వకపోతే రేపటి నుంచి సమ్మె
Gold Price Today: పసిడి పరుగులు.. దేశీయంగా బంగారం ధరలు పెరిగితే.. ఈ నగరాల్లో తగ్గింది..!