Hyderabad: మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి.. ఆరుగురు యువతులు సహా 8 మంది అరెస్ట్

Police raids: మసాజ్ సెంటర్ల మాటున అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న.. మరో కేంద్రంపై హైదరాబాద్ పోలీసులు..

Hyderabad: మసాజ్ సెంటర్‌పై పోలీసుల దాడి.. ఆరుగురు యువతులు సహా 8 మంది అరెస్ట్
Massage Center
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Aug 06, 2021 | 7:11 AM

Police raids: మసాజ్ సెంటర్ల మాటున అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న.. మరో కేంద్రంపై హైదరాబాద్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని ఓ మసాజ్‌ సెంటర్‌పై వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం దాడులు చేశారు. మసాజ్ సెంటర్ మాటున అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే సమాచారంతో దాడులు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆరుగురు మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు 12 లోని ఓ మసాజ్‌ సెంటర్‌కు కొందరు యువతులను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. తాజాగా కొందరు యువతులను తీసుకొచ్చారన్న.. ముందస్తు సమాచారంతో వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారిస్తున్నామని.. దీని వెనుక ఎవరెవరు ఉన్నది తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు. కాగా.. హైదరాబాద్‌లో గతంలో పలు మసాజ్ సంటర్లపై పోలీసులు దాడులు చేసిన సంగతి తెలిసిందే.

Also Read:

AP SSC Results: నేడే టెన్త్ క్లాస్ రిజల్ట్స్.. ఫలితాలను చెక్ చేసుకోండిలా..

Silver Price Today: దిగి వచ్చిన వెండి ధరలు.. దేశీయంగా ప్రధాన నగరాల్లో ఎంత ధర ఉందంటే..!