లాభాలతో ఆశ చూపారు.. ఏకంగా రూ.40 లక్షలు దోచేశారు.. వాట్సప్ మెసేజ్‌లతో నయా మోసం!
ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆశ చూపారు. మొదట్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేయమంటూ ఎర వేశారు.
ముందు లాభాలతో ఆశ చూపించారు. బాగానే ఉండడంతో నమ్మని ఓ వ్యక్తి అప్పులు చేసి మరీ ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేశాడు. తీరా చూస్తే.. చేతికి చిల్లి గవ్వకూడా దక్కలేదు. దీంతో భోరుమంటూ సైబరాబాద్ పోలీసుల చెంతకు చేరాడు. ఇది హైదరాబాద్ నగరంలో జరగడం గమనార్హం. పోలీసుల వివరాల మేరకు.. శేరిలింగంపల్లికి చెందిన ఓ బాధితుడు.. వాట్సాప్‌లో +447901695636(లిండా) అనే నంబర్ నుంచి ఓ మెసేజ్ వచ్చింది. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట వచ్చిన ఈ మెసేజ్… నగర వాసిని ఆకర్షించంది. ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆశ చూపారు. మొదట్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేయమంటూ ఎర వేశారు. దీంతో ప్లాట్‌ఫాం వెబ్‌సైట్ కు సంబంధించిన లింక్‌లను పంపించి, రూ.50 వేలు ఇన్వెస్ట్ చేయమంలూ కోరారు. అలాగే రూ.50వేలు అందులో పెట్టాడు. అయితే, బాధితుడికి రూ.12 వేలు లాభం వచ్చినట్లు ఆశ చూపించారు. వాటిని డ్రా చేసుకోవాలంటూ కూడా సూచించారు.
మరోసారి రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేయాలంటూ కోరారు. ఈ సారి రూ.50 వేలు లాభం చూపించారు. దీంతో బాధితుడికి నమ్మకం పెరడగడంతో పాటు తెలిపిస వారి దగ్గర నుంచి అప్పు తీసుకుని, అలాగే పర్సనల్ లోనే తీసుకుని మరికొంత ఇలా మొత్తం రూ. 40 లక్షలను గత నెల 19 నుంచి 26 వరకు ‘లార్డ్ బుద్ధ సర్వీసెస్’ బ్యాంక్ ఖాతాలో వేశాడు. బాధితుడి పెట్టుబడికి దాదాపు రూ.2 కోట్లు వచ్చాయంటూ సంబందిత వెబ్‌సైట్‌లో చూపించారు. కానీ, ఈ సారి మాత్రం విత్‌డ్రా చేద్దామంటే మాత్రం వీలుకాలేదు. కొన్ని రోజులకు అసలు ఆ వెబ్‌సైట్ కనిపించకుండా పోయింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబరాబాద్ పోలీసులను సంప్రదించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. కొన్ని రోజులు తర్వాత ఆ వెబ్‌సైట్ కనిపించలేదు. వాళ్ల ఫోన్ నంబర్లు పనిచేయక పోవడంతో మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు పోలీసులు, ప్రభుత్వం, బ్యాంకులు ఇప్పటికే ఇలాంటి వాటిని నమ్మవద్దంటూ ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేసినా.. ప్రజలు పట్టించుకోవడం లేదు. భారీగా లాభాలొస్తున్నాయంటూ అందులో పెట్టుబడి పెట్టి మోసపోతున్నారు. చివరికి పోలీసులకు ఆశ్రయిస్తున్నారు. అలా కాకుండా ముందు నుంచే జాగ్రత్తగా ఉంటే ఎలాంటి నష్టం జరకుండా ఉంటుంది. ఇకనైనా ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Hyderabad: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ దందా.. బాల్‌కో జీవితం నాశనం.. కట్ చేస్తే..