Viral Video: వధువు చుంబనం.. వరుడు ఢమాల్.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న లవ్లీ వీడియో..

Viral Video: పెళ్లికి సంబంధించిన వీడియోలు ఈ మధ్యకాలంలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, ఇలా ఏ మతాచారం ప్రకారం

Viral Video: వధువు చుంబనం.. వరుడు ఢమాల్.. నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్న లవ్లీ వీడియో..
Groom And Bride
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 05, 2021 | 8:38 PM

Viral Video: పెళ్లికి సంబంధించిన వీడియోలు ఈ మధ్యకాలంలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు, ఇలా ఏ మతాచారం ప్రకారం జరిగే వివాహంలో అయినా.. రకరకాల విధానాలు పాటిస్తుంటారు. అయితే, ప్రస్తుతం ట్రెండ్ మారుతోంది. ఆ ట్రెండ్ ప్రకారం జంటలు వివాహం చేసుకుంటున్నారు. తమ వివాహ వేడుక కలకాలం గుర్తుండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ మేరకు ఈవెంట్లు క్రియేట్ చేయడం, ఫన్నీ స్కిట్‌లు చేయడం వంటివి చేస్తున్నారు.

క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగే వివాహాల్లో సాధారణంగా.. వధు వరులు ఇద్దరూ కిస్ చేసుకుంటారు. తాజాగా ఓ క్రిస్టియన్ జంట వివాహం జరిగింది. వారిద్దరూ సంప్రదాయం ప్రకారం చేతి ఉంగరాలు మార్చుకున్న తరువాత.. వివాహాన్ని నిర్ధారిస్తూ కిస్ చేసుకున్నారు. అయితే, వధువుకు ముద్దు ఇచ్చిన వరుడు.. ఆ అదర చుంబనానికి మైమరిచిపోయాడు. ఇంకేముంది మైకంతో ఢమాల్ అనిపడిపోయాడు. అయితే వరుడి వెనకాలే కొందరు.. అతన్ని కిందపడకుండా పట్టుకుని.. మళ్లీ యధావిధిగా నిలబెట్టారు. కాగా, వరుడి చర్యకు సిగ్గుపడిపోయిన వధువు.. ముసిముసి నవ్వులతో ఆ వాతావరణాన్ని మరింత అందంగా మార్చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 1.5 లక్షల లైక్స్ వచ్చాయి. ఈ లవ్లీ కపుల్ వీడియోను మీరూ చూసేయండి మరి.

Viral Video:

Also read:

Big Boss 5: బిగ్‌బాస్‌ 5 మరో అప్‌డేట్.. ఈ సీజన్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకోనుంది ఆ యూట్యూబ్‌ స్టారేనా?

Bigg Boss 5 Telugu: కంటెస్టెంట్ల లిస్ట్ మామూలుగా లేదు.. వీరందరూ ఫిక్స్ అట !

One Nation One Election: కేంద్రం పరిశీలనలో జమిలి ఎన్నికలు.. పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి..