Andhra Pradesh: అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫరీక్షలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్.. పూర్తి వివరాలు మీకోసం..

Andhra Pradesh: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్‌ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ సెకండియర్

Andhra Pradesh: అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫరీక్షలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్.. పూర్తి వివరాలు మీకోసం..
Ap Intermediate Board
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 06, 2021 | 11:55 AM

Andhra Pradesh: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్‌ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు టెన్త్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ప్రాక్టికల్స్‌లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిలందరినీ కనీస ఉత్తీర్ణత మార్కులతో సెకండ్ ఇయర్‌కి ప్రమోట్ చేశారు. అయితే, ఇలా పాస్ చేయడం నచ్చని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఆ ప్రకటన మేరకు ఇటీవలే.. ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. అయితే, ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు క్లారిటీ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఎవరు పరీక్ష రాయొచ్చు.. పరీక్ష స్వరూపం ఎలా ఉంటుంది.. ఫీజు చెల్లించాలా వద్దా.. మార్కులు ఎలా కేటాయిస్తారు.. అనే అంశాలపై క్లారిటీ ఇచ్చారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు(రెగ్యూలర్).. 2020–21 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ఫస్టియర్‌లో చేరి ఐపీఈ–మార్చి 2021 పరీక్షలకు ఫీజు చెల్లించినవారందరినీ కనీస ఉత్తీర్ణత మార్కులతో సెకండియర్‌లోకి ప్రమోట్ చేయడం జరిగిందని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు. కనీస ఉత్తీర్ణత మార్కుల కంటే ఎక్కువ మార్కులు సాధించాలనుకునే విద్యార్థులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయొచ్చు అని తెలిపారు. ఈ పరీక్షలకు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ ఐపీఈ-2021 పరీక్షలకు ఫీజు చెల్లించని విద్యార్థులు.. ఇప్పుడు ఫీజు చెల్లించి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. ఇక ఈ పరీక్షలు రాయని విద్యార్థులకు.. ఇచ్చిన కనీస ఉత్తీర్ణత మార్కులే కొనసాగుతాయిని రామకృష్ణ తెలిపారు.

ఇంటర్మీడియట్ సెకండర్ ఇయర్(రెగ్యూలర్) పూర్తిచేసిన విద్యార్థులకు.. ఐపీఈ మార్చి – 2021 పరీక్ష ఫీజు చెల్లించిన సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ మార్కులను(ఫస్ట్, సెకండ్ ఇయర్) మెరుగుపరుచుకోవడానికి ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, నేరుగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావొచ్చని అన్నారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కులే విద్యార్థులకు ఫైనల్ మార్కులు. విద్యార్థులంతా ఎథిక్స్‌, హ్యూమన్‌ వ్యాల్యూస్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షల్లో క్వాలిఫై అవ్వాలి. అలా కాని వారు ఈ పరీక్షలకు ఫీజు చెల్లించాలన్నారు. ఇక ప్రాక్టికల్‌ పరీక్షల్లో ఫెయిల్ అయిన, గైర్హాజరు అయినవారు పరీక్ష ఫీజు చెల్లించి ప్రాక్టికల్స్‌కు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. అయితే, ప్రాక్టికల్ మార్కులను పెంచుకోవడానికి ఛాన్స్ లేదని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రామకృష్ణ స్పష్టం చేశారు.

Also read:

Viral Video: క్యాబ్ డ్రైవర్‌ను కొట్టిన యువతి.. మరో వీడియో వైరల్.. చూస్తే షాక్ అవుతారు..

MU Admissions 2021: యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ముంబై యూనివర్సిటీ నోటిఫికేషన్.. చివరి తేదీ ఎప్పుడంటే..

Viral Video: పీత తలపై గుడ్డు పగలగొట్టాడు.. వీడియో వైరల్.. ఊహించని రీతిలో నెటిజన్ల రియాక్షన్..