Viral News: కిటికీల్లేవు.. గదుల్లేవు.. ఈ ఇంటి ధర ఏకంగా రూ. 7 కోట్లు.. ప్రత్యేకత ఏంటంటే?

పైన పటారం.. లోన లొటారం.. సినిమాల్లో కనిపించే ప్రతీ సెట్‌ పరిస్థితీ ఇంతే. ఎన్నో విచిత్రమైన ఇళ్లు కనిపిస్తుంటాయి. బయట బాగానే ఉన్నా..

Viral News: కిటికీల్లేవు.. గదుల్లేవు.. ఈ ఇంటి ధర ఏకంగా రూ. 7 కోట్లు.. ప్రత్యేకత ఏంటంటే?
House
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 06, 2021 | 11:47 AM

పైన పటారం.. లోన లొటారం.. సినిమాల్లో కనిపించే ప్రతీ సెట్‌ పరిస్థితీ ఇంతే. ఎన్నో విచిత్రమైన ఇళ్లు కనిపిస్తుంటాయి. బయట బాగానే ఉన్నా.. లోపలికి పోయి చూసేసరికి గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ ఇంటి గురించి మాట్లాడుకుందాం. ఈ ఇంటికి కిటికీల్లేవు.. గదుల్లేవు.. అమ్మకానికి వచ్చింది. ధర ఏకంగా రూ. 7 కోట్లు అట. ఇంతకీ ఆ ఇల్లు ఎక్కడ ఉంది. దాని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.

1

అమెరికాలోని డల్లాస్‌లో ఓ విచిత్ర ఇల్లు అమ్మకానికి వచ్చింది. దాని ధర ఏకంగా 1 మిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ. 7,43,79,300. వామ్మో.! ఇంత ఖరీదు ఏంటి బాబు.! అనుకోవచ్చు. సూపర్బ్ ఇల్లు అని మీరు అనుకుంటే పొరపాటే.. లోపలికి వెళ్లి చూస్తే మీరు షాక్ అవుతారు.

3

గదులుండవ్.. కిటికీలుండవ్.. అంతా తావిద్ మహిమ అన్నట్టు.. పైన పటారం… లోన లోటారమే. ఈ ఇంటి లోపల కేవలం ఓ గ్లాస్ సెక్యూరిటీ విండో ఉంటుంది. అంతేకాకుండా ప్రతీ గది కార్పెట్‌తో కవర్ చేసి ఉంటుంది. దాదాపు 21 ఏళ్ల క్రితం ఈ ఇల్లు నిర్మించారట. తాజాగా ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయలను వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ ఇంటికి ఆకర్షణ లేదు”.. ”నాలుగు గోడలు.. ఒక పైకప్పు” ఇంకేముంది ఇందులో ప్రత్యేకత అంటూ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Read:

మొసలికి చిక్కిన అడవి దున్న.. కట్ చేస్తే సీన్ రివెర్స్.. చూస్తే షాక్ అవ్వాల్సిందే!

బ్రతుకున్న పామును కరకరా నమిలి మింగేసిన యువకుడు.. కారణం తెలిస్తే షాకే.!

10 వేలకుపైగా పరుగులు, 1697 వికెట్లు.. ఈ దిగ్గజ క్రికెటర్ మామూలోడు కాదు.. అతడెవరో తెలుసా!

2