Delhi Liquor Scam: ఈడీ విచారణకు కవిత హాజరవుతారా? నేడు ఎలాంటి ట్విస్ట్ ఉండబోతోంది?!
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో.. ఇవాళ్టి ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరవుతారా? లేదా? ఇప్పటికే దేశరాజధానికి చేరుకున్న ఆమె... లీగల్ టీమ్‌తో చర్చలు జరిపారు. మంత్రులు కేటీఆర్, హరీశ్..
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో.. ఇవాళ్టి ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరవుతారా? లేదా? ఇప్పటికే దేశరాజధానికి చేరుకున్న ఆమె… లీగల్ టీమ్‌తో చర్చలు జరిపారు. మంత్రులు కేటీఆర్, హరీశ్.. ఎంపీ సంతోష్ సైతం బయల్దేరి వెళ్లారు. మరి, ఈ వ్యవహారంలో ఏ జరగబోతోంది? ఎలాంటి మలుపు తీసుకోబోతోంది?
బేగంపేట నుంచి ప్రత్యేక ఫ్లైట్‌లో ఢిల్లీ వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. ఆమె వెంట మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారించాలని ఈడీ కవితకు నోటీసులిచ్చింది. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఈడీ విచారణ, కోర్టు వాయిదాలు.. నిందితుల కస్డడీ ఇలా చాలా పరిణామాలు కేసు చుట్టూ తిరుగుతున్నాయి.
ఈ నెల 11న కవితను విచారించిన ఈడీ అధికారులు.. 16న మరోసారి హాజరుకావాలని ఆదేశించారు. అయితే ఢిల్లీ వెళ్లిన కవిత విచారణకు మాత్రం హాజరుకాలేదు. తన ప్రతినిధిగా సోమ భరత్ కుమార్‌ను ఈడీ కోరిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను పంపించారు. విచారణకు హాజరుకానప్పటికీ దాన్ని గైర్హజరుగా పరిగణించలేని పరిస్థితిని సృష్టించారు. దీంతో మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ.. 20న విచారణకు రావాలని సూచించింది.
ఈడీ జారీ చేసిన నోటీసుల్లో ఈసారి వ్యక్తిగతంగా అన్న పదాన్ని ప్రస్తావించారని.. ఈ పరిస్థితుల్లో కవిత రేపు విచారణను ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. విచారణలో భాగంగా కవితను తమ కస్టడీలో ఉన్న అరుణ్ రామచంద్రన్ పిళ్ళైతో పాటుగా ప్రశ్నించాలని భావిస్తోంది ఈడీ. అయితే కవిత విచారణపై ఇవాళ క్లారిటీ రానుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితకు నోటీసులపై సెటైర్లు వేశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కల్వకుంట్ల ఫ్యామిలీ ఉందని కేసు ఫైల్ కాలేదని.. తీగలాగితే వ్యాపారులంతా బయటికొచ్చారని అన్నారు. ఫైనల్‌గా కవిత-ఈడీ ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఆమె ఇవాళ విచారణకు హాజరవుతారా? లేదంటే ఇంతకుముందులాగే న్యాయవాదిని పంపిస్తారా? వీటికి మించి అనూహ్యమైన ట్విస్ట్‌లేమైనా చోటు చేసుకుంటాయా అన్న ఉత్కంఠ మొదలైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..