AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అక్టోబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు? సంచలన కామెంట్స్ చేసిన ఎంపీ నామా..

ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ, నామా నాగేశ్వరరావు ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. అక్టోబర్ లో, నవంబర్ ఎప్పుడైనా ఎన్నికలు జరుగుతాయని ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యాఖ్యానించడం

Telangana: అక్టోబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు? సంచలన కామెంట్స్ చేసిన ఎంపీ నామా..
Telangana
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 20, 2023 | 6:30 AM

ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ, నామా నాగేశ్వరరావు ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. అక్టోబర్ లో, నవంబర్ ఎప్పుడైనా ఎన్నికలు జరుగుతాయని ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మరింది. ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్, నవంబర్ ఎప్పుడైనా ఎన్నికలు జరుగొచ్చనీ.. మూడోసారి కూడా కేసీఆరే ముఖ్యమంత్రి అవడం ఖాయమన్నారు ఎంపీ నామా నాగేశ్వరరావు. రాబోయే ఎన్నికల్లో పువ్వాడ గెలిచితీరుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు బాధ్యతను.. మంత్రిగా పువ్వాడ మీద, ఎంపీగా తనమీద సీఎం కేసీఆర్ పెట్టారని వ్యాఖ్యానించారు. ఇదే మొదలని.. ఇప్పటినుంచే మీమీ ప్రాంతాల్లో ప్రచారం మొదలెట్టాలని కార్యకర్తలనుద్దేశించి దిశానిర్దేశం చేశారు.

కేసీఆర్‌ సపోర్ట్‌తో ఎదిగి ఆయన్నే గద్దెదించుతానంటున్నాడని.. 2014, 2018 ఎన్నికల్లో ఒక్క సీటు ఇచ్చినా.. జిల్లా అభివృద్ధికి కృషి చేసినందుకు ఆయన్ను గద్దెదించాలా?.. కేసీఆర్ ను ఎందుకు గద్దె దించాలంటూ పొంగులేటికి సవాల్‌ విసిరారు మంత్రి పువ్వాడ అజయ్‌. కొందరు ఇక్కడ పోటీ చేస్తారు కాని.. ఖమ్మంలో ఓటు హక్కు ఉండదన్నారు. తాను పెరిగిందీ, చదివిందీ ఇక్కడేనని, చచ్చేది కూడా ఇక్కడేననీ, మీకు ఇక్కడి మట్టిలో కలిసే దమ్ముందా అని ప్రశ్నించారు పువ్వాడ అజయ్‌.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..