Delhi liquor scam case: ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. ‘తెలంగాణ తల వంచదు..’

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 10వ తేదీనే విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేయడంపై కవిత స్పందించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ..

Delhi liquor scam case: ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. 'తెలంగాణ తల వంచదు..'
MLC Kavitha
Follow us

|

Updated on: Mar 08, 2023 | 11:12 AM

చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ కల్పించాలంటూ ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో ధర్నాకు ఎమ్మెల్సీ కవితకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 10వ తేదీనే విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేయడంపై కవిత స్పందించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ..

‘రాజకీయ రంగంలో తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా డిమాండ్. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు మహిళా సంఘాలతో కలిసి భారత్ జాగృతి ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ఒకరోజు నిరాహార దీక్షను తలపెట్టింది. ఈ క్రమంలోనే మార్చి 10న ఢిల్లీలో విచారణకు రావాల్సిందిగా ఈడి నాకు నోటీసులు జారీ చేసింది. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ ధర్నా, ముందస్తు అపాయింట్మెంట్ల రీత్యా విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయ సలహా తీసుకుంటాను. ఇలాంటి చర్యలతో బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సీఎం కేసీఆర్‌ని, బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం కుదరదని బీజేపీ తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగాడుతూనే ఉంటాం. దేశ అభ్యున్నతి కోసం గొంతెత్తుతాం. ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి తెలంగాణ ఎప్పటికీ తలవంచబోదని ఢిల్లీలో ఉన్న అధికారకక్షపరులకు గుర్తుచేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం ధైర్యంగా పోరాటం చేస్తాం’ అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ పిళ్లైని అరెస్ట్ చేసిన ఈడీ.. ఈ స్కామ్‌లో కవితకు సంబంధించిన కీలక వివరాలు వెల్లడించాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎమ్మెల్సీ ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తును కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు కవితను విచారించారు. ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
కొత్తిమీర గింజలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తాగితే..
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వేగం తగ్గింది సినిమాల్లో.. తనలో కాదు.! ట్రేండింగ్ స్టైల్ తో పూజా
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
వయ్యారి సొగసరి.. అంజలి అందాలకు ఫిదా అవుతున్న యూత్. ఫోటోస్..
స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ మేనకలా మెరిసిపోతున్న అమృత అయ్యర్.
స్టైలిష్ డ్రెస్ లో మోడరన్ మేనకలా మెరిసిపోతున్న అమృత అయ్యర్.
ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఈవినింగ్ వాకింగ్ చేస్తే.. ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
అఫీషియల్.. ఆహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అఫీషియల్.. ఆహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
సులువుగా బరువు తగ్గాలంటే ఈ ఒక్క సూపర్ డ్రింక్‌ తాగితే సరి..
సులువుగా బరువు తగ్గాలంటే ఈ ఒక్క సూపర్ డ్రింక్‌ తాగితే సరి..
మీకు తెలుసా.. ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట!
మీకు తెలుసా.. ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
తెలుగు మీడియాలో మరో సంచలనం.. టీవీ9తో సీఎం జగన్‌ ఇంటర్వ్యూ..
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
భారత్‌లో నథింగ్‌ ఫోన్‌ 2ఏ స్పెషల్‌ ఎడిషన్‌.. ధర, ఫీచర్స్‌ ఇవే..!
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..