AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha Walkar Case: ‘అఫ్తాబ్ శిక్షణ పొందిన చెఫ్.. మాంసాన్ని ఎలా నిల్వ చేయాలో బాగా తెలుసు’

అఫ్తాబ్‌ శిక్షణ పొందిన చెఫ్‌ అని, మాంసాన్ని ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేయవచ్చో నిందితుడికి బాగా తెలుసని ఢిల్లీ పోలీసులు మంగళవారం (మార్చి 7) స్థానిక కోర్టులో తెలియజేశారు..

Shraddha Walkar Case: 'అఫ్తాబ్ శిక్షణ పొందిన చెఫ్.. మాంసాన్ని ఎలా నిల్వ చేయాలో బాగా తెలుసు'
Shraddha Walkar Case
Srilakshmi C
|

Updated on: Mar 08, 2023 | 9:45 AM

Share

దేశ రాజధానిలో సంచలనం రేసిన శ్రద్ధా వాకర్‌ (27) హత్యోదంతం కేసులో కీలక విషయాలు బయటకొచ్చాయి. నిందితుడు ఆఫ్తాబ్‌ అమిన్‌ పూనమ్‌వాలా తన ప్రియురాలైన శ్రద్ధా వాకర్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేసి, 35 ముక్కలు చేసి వివిధ ప్రదేశాల్లో విసిరేసిన సంగతి తెలిసిందే. అఫ్తాబ్‌ శిక్షణ పొందిన చెఫ్‌ అని, మాంసాన్ని ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేయవచ్చో నిందితుడికి బాగా తెలుసని ఢిల్లీ పోలీసులు మంగళవారం (మార్చి 7) స్థానిక కోర్టులో తెలియజేశారు. నిందితుడు తాజ్ హోటల్‌లో శిక్షణ పొందిన చెఫ్. శ్రద్ధా వాకర్‌ను చంపిన తర్వాత ఆమె శరీర భాగాలు చాలా కాలం పాటు నిల్వ చేయడానికి డ్రై ఐస్, అగర్‌బత్తి వంటి వాటిని ఆర్డర్‌ చేసినట్లు తమ ధర్యాప్తులో బయటపడిందని పోలీసులు సాకేత్ కోర్టుకు తెలిపారు.

శ్రద్ధా వాకర్‌ హత్య చేసిన విధానం ఇదే..

ఛార్జ్‌ షీట్ ప్రకారం.. ఆప్తాబ్‌ తరచూ శ్రద్ధతో గొడవ పడేవాడు. కొన్నిసార్లు చెయ్యి చేసుకునేవాడు కూడా. ఓ సారి ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రద్ధను వదిలించుకోవడానికి ముందుగా ప్లాన్‌ చేసిన ఆఫ్తాబ్‌ గతేడాది (2022) మార్చి 28, 29 తేదీల్లో ముంబై టూర్‌ ప్లాన్‌ చేశాడు. అక్కడి నుంచి రిషికేశ్, డెహ్రాడూన్, ముస్సోరీ, మనాలి, చండీగఢ్‌, చివరిగా పార్వతి లోయకు చేరుకున్నారు. అక్కడ బంబుల్‌ యాప్‌ ద్వారా బద్రీ అనే వ్యక్తితో వీరికి పరిచయం ఏర్పడింది. ఈ జంటను అతను ఢిల్లీలోని తన ఇంటికి ఆహ్వానించాడు. మే 5న ఢిల్లీకి చేరుకున్న ఆఫ్తాబ్‌-శ్రద్ధ జంట బద్రీ ఇంట్లో 10 నుంచి 12 రోజులున్నారు. బద్రీ ఇళ్లు ఖాళీ చేయమని కోరగా చత్తర్‌పూర్ పహారీ ప్రాంతంలో ఓ ఫ్లాట్‌లో అద్దెకు దిగారు. గతేడాది మే 18న ఆమె ఛాతీపై కూర్చుని చనిపోయే వరకు ఉక్కిరిబిక్కిరి చేసాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని బాత్‌రూమ్‌లో దాచి, ముక్కలుగా నరికి పారేయాలని ప్లాన్ చేశాను.

అందుకోసం చత్తర్‌పూర్ పహాడీలోని ఓ షాప్‌ నుంచి ఒక రంపం, మూడు బ్లేడ్‌లు, సుత్తిని కొనుగోలు చేశాను. తొలుత ఆమె చేతులు కట్‌ చేసి పాలిథిన్‌ కవర్‌లో పెట్టి బాత్రూంలో దాచాడు. మరుసటి రోజు చెత్త సంచులు, కత్తులు కొన్నాడు. ఆ తర్వాత వాటిని తన ఫ్లాట్‌కు తరలించే క్రమంలో ప్రమాదవశాత్తు అతని చేతి మణికట్లు తెగింది. అదే రోజు సాయంత్రం ఆమె కాళ్లను నరికి చెత్త బ్యాగ్‌లో ఉంచాడు. వాటిని కొత్తగా కొన్న రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిచాడు. నేలపై రక్తాన్ని శుభ్రం చేయడానికి టాయిలెట్ క్లీనర్ బాటిళ్లను ఆర్డర్ చేసాడు. హత్య జరిగిన రెండు రోజుల తర్వాత శ్రద్ధా శరీరం నుంచి పేగులు, ఇతర అవయవాలను బయటకు తీసి, వాటిని ఒక పాలిథిన్ బ్యాగ్‌లో ప్యాక్ చేసి, తన ఇంటికి దగ్గరగా ఉన్న డస్ట్‌బిన్‌లో పడేశాడు. అనంతరం ఆమె శరీర భాగాలను ముక్కలు చేసి వేరువేరు ప్రదేశాలు విసిరేశాడు. నేరం జరిగిన ఆరు నెలల తర్వాత నవంబర్ 12న ఆఫ్తాబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ కేసులో అఫ్తాబ్ వాడిన కత్తులు, శ్రద్ధాకు సంబంధించిన ఎముకల డీఎన్ఏ వంటి బలమైన సాక్ష్యాలను పోలీసులు సేకరించారు. ఢిల్లీ పోలీసులు నేరం మొత్తం క్రమాన్ని కోర్టులో వివరించినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ ప్రసాద్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.