Delhi: ఢిల్లీలో ముగిసిన కవిత విచారణ.. 10 గంటల విచారణలో కీలక ప్రశ్నలు..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Mar 21, 2023 | 9:52 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటలకు పైగా సాగిన విచారణలో కీలక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే, తాను ఫోన్లను ధ్వంసం చేసినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో

Delhi: ఢిల్లీలో ముగిసిన కవిత విచారణ.. 10 గంటల విచారణలో కీలక ప్రశ్నలు..
Mlc Kavitha
Follow us

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటలకు పైగా సాగిన విచారణలో కీలక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే, తాను ఫోన్లను ధ్వంసం చేసినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో సదరు ఫోన్లు ఇవే అంటూ ఉదయం మీడియాకు ప్రదర్శించారు ఎమ్మెల్సీ కవిత. అనంతరం వాటిని దర్యాప్తు అధికారులకు అప్పగించారు. కాగా, ఇవాళ రాత్రి వరకు విచారణ జరగడంతో క్షణం క్షణం ఎంతో ఉత్కంఠ నెలకొంది. అయితే, మళ్లీ ఎప్పుడు రావాలి అనే విషయాన్ని ఈడీ చెప్పలేదు. ఇదే అంశంపై కవిత ప్రశ్నించగా.. తరువాత చెప్తామని ఈడీ అధికారులు బదులిచ్చినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం బుధవారం కవిత విచారణ లేనట్లేనని స్పష్టం అవుతోంది.

ముగిసిన కవిత విచారణ..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu