UPI-Credit Card Link: యూపీఐతో రూపే క్రెడిట్ కార్డ్‌ని ఎలా లింక్ చేయాలి?.. స్టెప్ బై స్టెప్ వివరాలివే..
మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నారా? అయితే, ఈ వార్త మీకు ఖచ్చితంగా ఉపకరిస్తుంది. ఆన్‌లైన్ చెల్లింపును ప్రోత్సహించడానికి, NPCI ఇటీవల కొత్త సదుపాయాన్ని కల్పించింది.
మీరు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తున్నారా? అయితే, ఈ వార్త మీకు ఖచ్చితంగా ఉపకరిస్తుంది. ఆన్‌లైన్ చెల్లింపును ప్రోత్సహించడానికి, NPCI ఇటీవల కొత్త సదుపాయాన్ని కల్పించింది. దీని కింద, మీరు రూపే క్రెడిట్ కార్డ్‌ను BHIM UPI యాప్‌కి లింక్ చేయవచ్చు. UPIతో లింక్ చేసిన తర్వాత.. కస్టమర్‌లు కార్డ్‌ని స్వైప్ చేయకుండానే ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ చేయొచ్చు. రూపే క్రెడిట్ కార్డ్‌ని UPIతో లింక్ చేస్తే.. ఏదైనా షాప్‌లో, మార్కెట్‌లో QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా చెల్లించవచ్చు. మరి మీరు మీ కార్డ్‌ని UPIతో లింక్ చేయకపోతే, ఇప్పుడు చేయాలనుకుంటే.. దశల వారీ విధానాన్ని ఇక్కడ మీకోసం ఇవ్వడం జరిగింది.
ఇలా UPIతో లింక్ చేయండి..
1. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని BHIM యాప్‌కి వెళ్లండి.
2. ఆపై, ‘యాడ్ క్రెడిట్ కార్డ్’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్‌ని జారీ చేసిన బ్యాంకును సెలక్ట్ చేసుకోవాలి.
3. ఆ తర్వాత మీకు UPI యాప్ రూపే క్రెడిట్ కార్డ్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోవాలి.
4. రూపే క్రెడిట్ కార్డ్‌లోని చివరి 6 అంకెలను నమోదు చేయండి.
5. ఇప్పుడు మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దానిని నమోదు చేయండి.
6. ఇప్పుడు మీ కార్డ్ UPI PINని సెట్ చేయండి.
7. పిన్ సెట్ చేసిన తర్వాత మీ కార్డ్ UPIకి లింక్ చేయబడుతుంది.
8. ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్‌ని లింక్ చేసిన తర్వాత, ఎక్కడైనా స్కాన్ చేసి దాని ప్రయోజనాలను పొందవచ్చు.
ఎవరు ఉపయోగించగలరు?
RBI జారీ చేసిన రూపే క్రెడిట్ కార్డ్‌తో ఎంపిక చేసిన కొంతమంది మాత్రమే UPIని ఉపయోగించగలరు. NPCI జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, PNB, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ కస్టమర్లు BHIM యాప్‌లో రూపే క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించడానికి వీలుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..