Pan – Aadhaar: ఈ వ్యక్తులు పాన్‌-ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం లేదు.. పూర్తి వివరాలివే..

పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 31, 2023ని గడువుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ గడువు తేదీ లోగా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయని వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Pan - Aadhaar: ఈ వ్యక్తులు పాన్‌-ఆధార్ లింక్ చేయాల్సిన అవసరం లేదు.. పూర్తి వివరాలివే..
Pan Aadhaar
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 20, 2023 | 7:00 AM

పాన్‌ కార్డును ఆధార్‌తో లింక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్చి 31, 2023ని గడువుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ గడువు తేదీ లోగా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయని వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే, సదరు వ్యక్తులు తమ పాన్‌కార్డును వినియోగించడం కష్టంగా మారుతుంది.

ఈ నేపథ్యంలోనే పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అదే సమయంలో ఆదాయపు పన్ను చట్టం – 1961 ప్రకారం.. మినహాయింపు పొందిన కేటగిరీలోకి రాని పాన్ కార్డ్ హోల్డర్లందరూ తమ పాన్‌ను మార్చి 31వ తేదీ లోపు ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి అని ఆదాయపు పన్ను శాఖ కూడా స్పష్టం చేసింది. మరోవైపు, పాన్ కార్డుతో ఆధార్‌ను లింక్ చేయడానికి కొంతమందికి మినహాయింపు ఇచ్చారు. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ వ్యక్తులకు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి కాదు..

మే 2017లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పాన్-ఆధార్ లింక్ చేయడం నుంచి కొందరికి మినహాయింపునిచ్చారు. సదరు వ్యక్తులు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి కాదు.

ఇవి కూడా చదవండి

అస్సాం, మేఘాలయ, జమ్మూ&కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఆదాయపు పన్ను చట్టం – 1961 ప్రకారం నాన్-రెసిడెంట్‌గా పరిగణిస్తారు. గత సంవత్సరం వరకు 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గల వ్యక్తులకు పాన్-ఆధార్ లింక్ నుంచి మినహాయింపునిచ్చారు.

పాన్ ఆధార్‌ను ఎలా లింక్ చేయాలి..

పాన్-ఆధార్ లింక్‌ను మీ ఇంట్లోనే కూర్చుని చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆన్‌లైన్ ప్రక్రియలో ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ incometaxindiaefiling.gov.inని సందర్శించడం ద్వారా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చు. అదే సమయంలో SMS ద్వారా కూడా పాన్ – ఆధార్‌ను లింక్ చేయవచ్చు. ఇందుకోసం మీరు UIDPAN < SPACE > < 12 ఆధార్ నంబర్‌లు> <SPACE> < 10 PAN నంబర్‌లు> ఫార్మాట్‌ని 567678 లేదా 56161కి పంపాలి. ఆఫ్‌లైన్ ప్రక్రియలో పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి సమీపంలోని పాన్ సేవా కేంద్రాన్ని లేదా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించవచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!