Business Ideas: సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి మించిన సాలరీ కావాలా..? ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 2 లక్షల వరకు సంపాదించే చాన్స్..

నిరుద్యోగులారా ఉద్యోగం కోసం వెతికి వెతికి నీరసించిపోయారా. ఇక ఏ మాత్రం ఆలోచించకండి వెంటనే ఓ చక్కటి వ్యాపారం చేయడం ద్వారా మీరు ప్రతి నెల పెద్ద ఎత్తున డబ్బు సంపాదించే అవకాశం ఉంది.

Business Ideas: సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి మించిన సాలరీ కావాలా..? ఈ బిజినెస్ చేస్తే నెలకు రూ. 2 లక్షల వరకు సంపాదించే చాన్స్..
Money
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 20, 2023 | 1:22 PM

నిరుద్యోగులారా.. ఉద్యోగం కోసం వెతికి వెతికి నీరసించిపోయారా.. ఇక ఏ మాత్రం ఆలోచించకండి వెంటనే ఓ చక్కటి వ్యాపారం చేయడం ద్వారా మీరు ప్రతి నెల పెద్ద ఎత్తున డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఈ వ్యాపారం కోసం పెట్టుబడి ఎవరు ఇస్తారా, అని ఆలోచించకండి. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ముద్ర రుణాలను పెద్ద ఎత్తున అందిస్తోంది. ముద్ర రుణాలను తీసుకోవడం కొత్తగా వ్యాపారం ప్రారంభించడం మాత్రమే కాదు. ఉన్న వ్యాపారం కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. బయట ప్రైవేటు వడ్డీలతో పోల్చి చూసినట్లయితే ప్రభుత్వ బ్యాంకు నుంచి లభించే ముద్రా రుణం చాలా తక్కువ వడ్డీకే లభిస్తోంది. అలాగే సులభ వాయిదాలను వడ్డీలను చెల్లించే అవకాశం ఉంటుంది. ముద్రా రుణాలను 50 వేల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వందే వీలుంటే. ఎలాంటి కొల్లాటరల్ హామీ లేకుండానే, మీరు ఈ రుణం పొందే వీలుంది.

ఇక వ్యాపారం విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ స్నాక్స్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశం గా మార్చుకునే వీలుంది. భారతీయ వంటకాలలో సమోసా కు ముఖ్యమైన స్థానం ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు సమోసాల తినేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ప్రస్తుతం మార్కెట్లో రెండు రకాల సమోసా ఎక్కువగా అమ్ముడవుతూ ఉంటాయి. ఒకటి సాంప్రదాయ ఆలు సమోసా. పిండి మధ్యలో ఆలుగడ్డ కూరను పెట్టి ఈ సమోసాలు చేస్తారు. రెండోది చిన్న సమోసా దీనిలో స్వీట్ కార్న్ గింజలు, లేదా ఉల్లి పాయ కూరను పెట్టి చేస్తారు. ఈ తరహా సమోసాలు రెండు రోజుల పాటు నిల్వ ఉంటాయి.

అయితే మీరు వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే సమోసా సెంటర్ ప్రారంభించి చక్కటి ఆదాయం పొందేవీలుంది. ఇందుకోసం మంచి కమర్షియల్ సెంటర్ లో ఓ షాపును అద్దెకు తీసుకొని సమోసా సెంటర్ తెరవవచ్చు. వంట సామాన్ల కొనుగోలు చేసేందుకు రూ. 20 వేల నుంచి 30 వేల వరకూ ఖర్చు అవుతుంది. అలాగే కమర్షియల్ స్టౌ, అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ అవసరం.

ఇవి కూడా చదవండి

మీరు సమోసా సెంటర్ ను వినూత్నంగా నడపాలి అనుకుంటే, వివిధ రకాల సమోసాలను తయారు చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మెనూ ప్రిపేర్ చేసుకోవాలి. వెజ్, నాన్ వెజ్ సమోసాలను తయారు చేస్తే, వెరైటీ రుచులను ఇష్టపడే వారు మీ సమోసా సెంటర్ కు తరలి వస్తారు. ఉదాహరణకు చికెన్ సమోసా, మటన్ సమోసా, ఎగ్ బుర్జీ సమోసా వంటి నాన్ వెజ్ రుచులతో పాటు, పన్నీర్ సమోసా, బేబీ కార్న్ సమోసా, మశ్రూమ్ సమోసా, చీజ్ సమోసా, వంటి రుచులతో మీరు ప్రయోగం చేయవచ్చు. తద్వారా కస్టమర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది.

సమోసా సెంటర్ సక్సెస్ అవుతే కనీసం రోజుకు రూ. 5 వేల వరకూ సంపాదించవచ్చు. అలాగే కొంత మందికి ఉపాధి కూడా కల్పించవచ్చు. ఈ లెక్కన నెలకు రూ. 1. 50 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకూ సంపాదించే వీలుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి