అయ్యో పాపం..! ఆ కంపెనీ సీఈఓ శాలరీ నెలకి రూ.15 వేలేనటా!.. కారణం అదేనట..!!

ఆయన సమాధానం విని యూజర్లు షాక్ అవుతున్నారు. అన్ని కోట్ల ఆస్తి ఉండే కంపెనీ సీఈవో(CEO) అంత తక్కువ జీతం తీసుకోవడం చూసి అందరూ అవాక్కవుతున్నారు. ట్విట్టర్ వంటి సామాజిక సైట్లలో కూడా ఈ విషయం చర్చనీయాంశమైంది.

అయ్యో పాపం..! ఆ కంపెనీ సీఈఓ శాలరీ నెలకి రూ.15 వేలేనటా!.. కారణం అదేనట..!!
Cred Ceo
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 28, 2023 | 5:15 PM

CEO లు సంవత్సరానికి కోటి కంటే ఎక్కువ సంపాదిస్తారు . ప్రపంచంలోని టాప్ గ్రేడ్ CEO ల (CEO జీతాలు) జీతం సంవత్సరానికి 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువగానే ఉంటుంది. భారతదేశంలో ఇన్ఫోసిస్ సీఈఓ వేతనం రూ. 71 కోట్లు. ఇకపోతే సుందర్ పిచాయ్, సత్యనాదెళ్ల వంటివారి జీతాలు కోట్లల్లోనే ఉంటాయనడంతో సందేహం లేదు. కానీ ఇక్కడొక కంపెనీ సీఈవో నెలకు కేవలం రూ.15 వేలు మాత్రమే జీతం తీసుకుంటూ వార్తల్లో నిలిచారు. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ CEO జీతం ఎంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మీరు Cred యాప్ పేరు వినే ఉంటారు. CRED CEO కునాల్ షా జీతం నెలకు 15 వేల రూపాయలు మాత్రమేనట. అంటే సంవత్సరానికి 2 లక్షల రూపాయల కంటే తక్కువే.

ఇన్ స్టాగ్రామ్ వేదికగా ”ఆస్క్ మీ ఎనీ థింట్” అనే కార్యక్రమంలో క్రెడ్ ఫౌండర్ కునాల్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ యూజర్ ఆయన జీతం ఎంతుంటుందని ప్రశ్నించారు. అందుకు కునాల్ షా మాట్లాడుతూ తాను రూ.15 వేల జీతాన్ని మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన సమాధానం విని యూజర్లు షాక్ అవుతున్నారు. అన్ని కోట్ల ఆస్తి ఉండే కంపెనీ సీఈవో(CEO) అంత తక్కువ జీతం తీసుకోవడం చూసి అందరూ అవాక్కవుతున్నారు. ట్విట్టర్ వంటి సామాజిక సైట్లలో కూడా ఈ విషయం చర్చనీయాంశమైంది.

ఇవి కూడా చదవండి

తమ కంపెనీ లాభాల బాట పట్టేంత వరకూ తాను నెలకు రూ.15 వేల జీతం మాత్రమే తీసుకుంటానని కునాల్ షా తెలిపారు. తాను ఫ్రీఛార్జ్ కంపెనీని అమ్మానని, అలా వచ్చిన డబ్బుతోనే జీవిస్తున్నట్లు కునాల్ షా మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఈ పోస్ట్‌పై నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. ఇంత తక్కువ జీతాలు తీసుకుంటామని సీఈవోలు చెప్పడంలో వాస్తవం లేదని కొందరు వ్యాఖ్యానించారు. కంపెనీ ఖర్చులతో రోజుకు లక్షలు ఖర్చు పెడుతుంటాడని, లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడని, జీతం విషయం వచ్చేసరికి నెలకు అంత తక్కువే తీసుకుంటున్నాడని పలు విమర్శలు వెల్లువెత్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!