AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

6G Technology: భారత్‌లో 6జీ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.? కేంద్ర మంత్రి కీలక విషయాలు.

భారత టెలికాం రంగానికి జీఎస్‌ఎమ్‌ గ్లోబల్‌ అవార్డు దక్కిందని తెలిపిన కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇది ప్రభుత్వ విధానాల ఫలితమని అన్నారు. దేశంలో ఇప్పటికే విస్తరిస్తోన్న 5జీ నెట్‌వర్క్‌ గురించి చెప్పుకొచ్చిన కేంద్ర మంత్రి..

6G Technology: భారత్‌లో 6జీ సేవలు ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయి.? కేంద్ర మంత్రి కీలక విషయాలు.
6g Technology
Narender Vaitla
|

Updated on: Feb 28, 2023 | 4:26 PM

Share

భారత టెలికాం రంగానికి జీఎస్‌ఎమ్‌ గ్లోబల్‌ అవార్డు దక్కిందని తెలిపిన కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ ఇది ప్రభుత్వ విధానాల ఫలితమని అన్నారు. దేశంలో ఇప్పటికే విస్తరిస్తోన్న 5జీ నెట్‌వర్క్‌ గురించి చెప్పుకొచ్చిన కేంద్ర మంత్రి.. ప్రపంచ దేశాల మాదిరిగానే 6జీ టెక్నాలజీ పంగా భారత్‌ ముందుడాలని కోరుకుంటోందని చెప్పుకొచ్చారు. 6G సేవల కోసం భారతదేశం 100 పేటెంట్లను పొందిందని మంత్రి తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ నుంచి నివేదిక అందిన తర్వాత త్వరలోనే ఈ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ దశాద్దం చివరి నాటికి దేశంలో 6జీ నెట్‌వర్క్ ప్రారంభం కానుందని మంత్రి అన్నారు. ఈ లెక్కన వచ్చే పదేళ్లలో భారత్ 6జీ నెట్‌వర్క్‌ను అందిపుచ్చుకోనుందని అర్థమవుతోంది. ఇక దేశం మొత్తం 5జీ సేవలు ఎప్పుడి విస్తరిస్తారన్న దానిపై మంత్రి మాట్లాడుతూ.. 2024 డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రానున్న రోజుల్లో టెలికాం రంగంలో పెద్ద ఎత్తున కొత్త ఉద్యోగాలు వస్తాయని మంత్రి అన్నారు. గ్లోబల్ స్పీడ్ టెస్ట్‌లో భారత్ తన స్థానాన్ని 118 నుంచి 69కి ప్రస్తుతం 49కి చేరుకుందని చెప్పుకొచ్చారు.

మంత్రి ఇంకా మాట్లాడతూ.. ‘ప్రస్తుతం దేశంలో 99 శాతం మంది దేశంలో తయారైన స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. భారత్‌లో తయారైన 10 మిలియన్ డాలర్ల విలువైన మొబైల్‌ను ఎగుమతి చేయనున్నారు. భారతదేశంలో UPI పట్ల ప్రజల ఆసక్తి పెరగడమే కాకుండా, 50 నుంచి 60 దేశాలు UPI విధానాన్ని అవలంబించడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇదిలా ఉంటే దక్షిణ కొరియా 2028 నాటికి 6జీ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్లాన్‌ చేస్తోంది. ప్రపంచంలోనే 6G సేవలను తొలుత అందుబాటులోకి తీసుకొచ్చే దేశంగా మారనుంది. ఇందుకు సుమారు రూ. 3,978 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..