Nokia New Logo: హలో.. నోకియా లోగో మారిపోయింది.. గమనించారా..: 60 ఏళ్లలో తొలిసారి ఇలా ఎందుకంటే..

నోకియా ప్రారంభించిన తర్వాత తొలిసారిగా తన లోగోను మార్చుకుంది. నోకియా లోగో ఇకపై నీలం రంగులో ఉండదు. సందర్భానుసారంగా ఇతర రంగుల షేడ్స్‌లోకి మారిపోతుంది.

Nokia New Logo: హలో.. నోకియా లోగో మారిపోయింది.. గమనించారా..: 60 ఏళ్లలో తొలిసారి ఇలా ఎందుకంటే..
Nokia Changes Iconic Logo
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 28, 2023 | 6:26 PM

ఫిన్లాండ్‌కు చెందిన బహుళజాతి కంపెనీ నోకియా 60 ఏళ్ల తర్వాత తొలిసారిగా తన లోగోను మార్చింది. నోకియా లోగో వేగవంతమైన వృద్ధి.. మార్పును ప్రతిబింబించేలా మార్చబడింది. కొత్త మార్కెట్ అవసరాలకు అనుగుణంగా దాని పని శైలిలో మార్పులు చేసుకుంది. అంతర్జాతీయ టెక్నాలజీ రిపోర్టింగ్ మీడియా అందించిన సమాచారం ప్రకారం, నోకియా టెలికాం పరికరాల విభాగానికి సీఈఓగా పెక్కా లండ్‌మార్క్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెద్ద మార్పును తీసుకొచ్చింది. కొత్త CEO పెక్కా లండ్‌మార్క్ సంస్థ పురోగమనం కోసం త్రిముఖ ప్రణాళికను రూపొందించారు.

నోకియా ఇకపై దాని పేరు, లోగోలో నీలం రంగును ఉపయోగించదని తేల్చి చెప్పింది. ఇందుకు బదులుగా.. పరిస్థితులకు బాగా సరిపోయే షేడ్స్‌ను ఉపయోగించనున్నట్లుగా వెల్లడించింది. నిర్దిష్ట రంగు అలానే ఉండదని తెలిపింది. నోకియా ఇకపై కేవలం స్మార్ట్‌ఫోన్ కంపెనీ మాత్రమేనని, వాణిజ్య సాంకేతిక సంస్థ అని లుండ్‌మార్క్ తెలిపారు.

నోకియా తన టెలికాం పరికరాల వ్యాపారాన్ని విస్తరించడంతోపాటు ఇతర వ్యాపారాలకు పరికరాలను విక్రయించడంపై దృష్టి సారిస్తుంది. వీటిలో ఆటోమేటెడ్ మాన్యుఫ్యాక్చరింగ్, ప్రైవేట్ 5G నెట్‌వర్క్‌ల కోసం సాధనాలు ఉన్నాయి. దీంతో మార్కెట్‌లో మైక్రోసాఫ్ట్, అమెజాన్‌లకు నోకియా నేరుగా పోటీ పడనుంది. నోకియా తన కార్యకలాపాలను మరిన్ని రంగాల్లోకి విస్తరించాలని, అభివృద్ధి చేయాలని చూస్తోందని లండ్‌మార్క్ తెలిపారు.

నోకియా కొత్త మొబైల్‌..

నోకియా నోకియా G22ను ప్రకటించింది. ఇది ఇంట్లోనే మరమ్మతులు చేసుకునేలా రూపొందించిన మొట్టమొదటి బడ్జెట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్. ఇది iFixit భాగస్వామ్యంతో ఐదు నిమిషాల్లో బ్యాటరీని రీప్లేస్ చేసుకోవచ్చు. Nokia G22 ఒక తొలగించగల వెనుక కవర్, బ్యాటరీ, స్క్రీన్, ఛార్జింగ్ పోర్ట్‌తో సహా అన్ని భాగాలను సులభంగా ఓపెన్ చేసి తిరిగి ఫిట్ చేసుకునేలా డిజైన్‌ చేశారు.

G22 ఫోన్ పాక్షికంగా రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్‌తో తయారు చేయబడింది. 6.53-అంగుళాల స్క్రీన్, పెద్ద-సామర్థ్య బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 12లో రన్ అవుతుంది. సెక్యూరిటీ అప్‌డేట్‌లు, రెండు ప్రధాన ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌గ్రేడ్‌లు ప్రతి నెలా మూడేళ్లపాటు అందించబడతాయి. శనివారం బార్సిలోనాలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌కు ముందు నోకియా ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టింది.

ప్రజలు ఎక్కువ కాలం ఉండే నాణ్యమైన పరికరాలను కోరుకుంటున్నారు. కానీ, ఇప్పుడు వాటి కోసం ఎక్కువ చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్త Nokia G22 ఉద్దేశపూర్వకంగా మరమ్మతు చేయదగిన డిజైన్‌తో నిర్మించబడింది. కాబట్టి మీరు దీన్ని ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చని HMD గ్లోబల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆడమ్ ఫెర్గూసన్ తెలిపారు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం