Vande Bharat Express: గుడ్‌ న్యూస్‌.. తెలంగాణకు మరో వందే భారత్‌ రైలు.. పూర్తి వివరాలు ఇవే..

భారతీయ రైల్వే రూపురేఖలు మార్చేసిన వందే భారత్‌ రైళ్లకు ప్రజల నుంచి భారీగా ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా పెద్ద ఎత్తున వందే భారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలను కనెక్ట్‌ చేస్తూ...

Vande Bharat Express: గుడ్‌ న్యూస్‌.. తెలంగాణకు మరో వందే భారత్‌ రైలు.. పూర్తి వివరాలు ఇవే..
Vande Bharat
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 28, 2023 | 4:06 PM

భారతీయ రైల్వే రూపురేఖలు మార్చేసిన వందే భారత్‌ రైళ్లకు ప్రజల నుంచి భారీగా ఆదరణ లభిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా పెద్ద ఎత్తున వందే భారత్‌ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాలను కనెక్ట్‌ చేస్తూ వందే భారత్‌ రైళ్లను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు ప్రజలకు ఇప్పటికే ఒక రైలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సేవలు అందిస్తోంది. త్వరలోనే సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య మరో వందే భారత్‌ అందుబాటులోకి రానున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్‌ సేవలు ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్-పూణె రూట్‌లో వందే భారత్ రైలు ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం సికింద్రాబాద్‌-పుణెల మధ్య ఉన్న శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైలును భారతీయ రైల్వే వందే భారత్ రైలుతో రీప్లేస్ చేయనున్నట్లు సమాచారం. ఏప్రిల్‌లో సికింద్రాబాద్‌-పుణె మార్గంలో రైలు పరుగులు తీయనుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న శతాబ్ధి ఎక్స్‌ప్రెస్ రైళ్లను వందే భారత్ రైళ్లతో రీప్లేస్ చేసే ఆలోచనలో ఇండియన్‌ రైల్వే ఉన్న విషయం తెలిసిందే.

ఇక ఏప్రిల్‌ నాటికి ఈ రైలును పట్టాలెక్కించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా త్వరలో సికింద్రాబాద్‌ నుంచి మొత్తం మూడు మార్గాల్లో వందే భారత్‌ పరుగులు పెట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్-బెంగళూరు, సికింద్రాబాద్-పుణె మార్గాల్లో వందే భారత్‌ పరుగులు పెట్టనునన్నట్లు తెలుస్తోంది. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?