Photo Saving Tips: ఫేస్‌బుక్ నుంచి నిష్క్రమిస్తున్నారా..? మరి అందులోని ఫొటోలను మీ గూగుల్‌ల్లో సేవ్ చేసుకోండిలా..

ముఖ్యంగా ఫోన్‌లో సోషల్ మీడియాలో ఎక్కువ సేపు యువత బ్రౌజింగ్ చేస్తూ ఉంటుంది. ఫేస్‌బుక్ ఎక్కువ మందిని ఆకట్టుకున్న సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్. అయితే ఈ ఫేస్ బుక్ వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం ఉంది. ముఖ్యంగా పోటీ పరీక్షల నేపథ్యంలో యువత కొన్ని రోజులు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవాలని కోరుకుంటారు.

Photo Saving Tips: ఫేస్‌బుక్ నుంచి నిష్క్రమిస్తున్నారా..? మరి అందులోని ఫొటోలను మీ గూగుల్‌ల్లో సేవ్ చేసుకోండిలా..
Photos
Follow us
Srinu

|

Updated on: Feb 28, 2023 | 3:00 PM

ప్రస్తుతం ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్ ట్రెండ్ నడుస్తుంది. ఫోన్ అంటే కేవలం కాల్స్, ఇంపార్టెంట్ మెసెజ్‌లు మాత్రమే అనుకునే కాలం నుంచి ప్రతి అవసరానికి ఫోన్ తప్పనిసరి అనే స్థితికి వచ్చాం. ఓ మాటలో చెప్పాలంటే ప్రస్తుత యువతకు స్మార్ట్ ఫోన్ కూడా నిత్యావసర వస్తువుగా మారిపోయిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫోన్‌లో సోషల్ మీడియాలో ఎక్కువ సేపు యువత బ్రౌజింగ్ చేస్తూ ఉంటుంది. ఫేస్‌బుక్ ఎక్కువ మందిని ఆకట్టుకున్న సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్. అయితే ఈ ఫేస్ బుక్ వల్ల ఎంత లాభం ఉందో అంతే నష్టం ఉంది. ముఖ్యంగా పోటీ పరీక్షల నేపథ్యంలో యువత కొన్ని రోజులు సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోవాలని కోరుకుంటారు. అయితే ఇలా అనుకునే వారు సోషల్ మీడియాలో ఫొటోలను ఏం చేయాలి? చాలా సార్లు మన కుటుంబం లేదా స్నేహితులతో ఎంజాయ్ చేసిన మధుర స్మృతులను సోషల్ మీడియాలో పెడుతూ ఉంటాం. మరి ఆ ఫొటోలు డిలీట్ అయ్యిపోతాయని అని బాధపడుతుంటాం. ఇలాంటి వారి కోసం ఫేస్ బుక్ ఓ  కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫొటలు, వీడియోలను ఇతర ప్లాట్ ఫామ్స్‌కు బదిలీ చేసే అవకాశాన్ని కల్పించింది. ముఖ్యంగా యూజర్లు తాము అప్ లోడ్ లేదా డౌన్ లోడ్ చేసుకున్న ఫొటోలు డైరెక్ట్‌గా గూగుల్ ఫొటోస్‌కు సెండ్ చేసే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ఫేస్ బుక్ నుంచి గూగుల్ ఫొటోస్‌కు ఫొటోస్‌ను ఎలా బదిలీ చేయాలో? ఓ సారి తెలుసుకుందాం.

ఫేస్ బుక్ నుంచి ఫొటోలు బదిలీ ఇలా

  • మొదటగా మీ పీసీలో నుంచి ఫేస్ బుక్‌లోకి లాగిన్ అవ్వాలి.
  • ఇప్పుడు టాప్‌లో రైట్ సైడ్ ఉన్న ప్రొఫైల్ ఆప్షన్‌ను క్లిక్ చేసి సెట్టింగ్స్ పేజీకు వెళ్లాలి. 
  • సెట్టింగ్ కింద ఎడమ వైపు ఉన్న ఫేస్ బుక్ సమాచారంపై క్లిక్ చేయాలి. 
  • అక్కడ ట్రాన్సర్ కాపీ ఆఫ్ యువర్ ఇన్‌ఫర్మేషన్ ఆప్షన్‌కు ముందు ఉన్న వ్యూ బటన్‌పై క్లిక్ చేయాలి.
  • తర్వాత గూగుల్ ఫొటోస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • తదుపరి పేజీలో ఏం బదిలీ చేయాలనే ఎంపికపై క్లిక్ చేసి ఎంపికలు సరిగ్గా ఉన్నాయో? లేదో? తనిఖీ చేసుకోవాలి. 
  • ఆ తర్వాత కనెక్ట్ బటన్‌పై క్లిక్ చేసి గూగుల్ ఎకౌంట్ లాగిన్ వివరాలతో లాగిన్ అవ్వాలి.
  • మొత్తం ఈ ప్రాసెస్ చేశాక స్టార్ట్ ట్రాన్స్‌ఫర్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఈ దశలో మిమ్మల్ని ఫేస్ బుక్ పాస్‌వర్డ్ మళ్లీ ఇంకోసారి అడుగుంది. వెంటనే దాన్ని నమోదు చేయాలి.
  • బదిలీ ప్రక్రియ పూర్తయ్యాక మీ ఫొటోలు, వీడియోలు గూగుల్ ఫొటోలకు అనుసంధానం అవుతాయి. 

ఈ డేటా బదిలీ వల్ల గూగుల్ డ్రైవ్, డ్రాప్ బాక్స్ మొదలైన ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో బదిలీ చేయడానికి అనుమతిని ఇస్తుంది. ఇలా చేయడం ద్వారా మీరు ఫేస్ బుక్ నుంచి విరామం తీసుకోవాలన్నా లేదా శాశ్వతంగా ఫేస్ బుక్ నుంచి నిష్క్రమించాలన్నా అందులోని ఫొటోలు మాత్రం మనం కోల్పోకుండా ఉంచుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు