మరోమారు ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైన జుకర్‌బర్గ్ !.. ఈసారి మేనేజర్ల వంతు.. త్వరలోనే పింక్‌ స్లిప్‌లు!

ఈసారి నిర్వాహకులను హెచ్చరించారు. ఇలా ఇన్ని స్థాయిల్లో మేనేజ్‌మెంట్ వ్యవస్థ అవసరమని తాను అనుకోవడం లేదని జుకర్‌బర్గ్ పేర్కొన్నట్టు తెలుస్తోంది.

మరోమారు ఉద్యోగుల తొలగింపుకు సిద్ధమైన జుకర్‌బర్గ్ !.. ఈసారి మేనేజర్ల వంతు.. త్వరలోనే పింక్‌ స్లిప్‌లు!
Layoffs Fear
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 01, 2023 | 12:29 PM

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటాలో ఉద్యోగుల్లో మరోమారు లే ఆఫ్ టెన్షన్‌ మొదలైంది. ఇప్పటికే 11,000 మందికి పైగా ఉద్యోగాలను తొలగించిన కొద్ది రోజుల్లోనే మళ్లీ తొలగింపులకు అవకాశం ఉందని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ సూచనప్రాయంగా తెలిపారు. ఈసారి నిర్వాహకులను హెచ్చరించారు. ఇటీవల జరిగిన అంతర్గత సమావేశంలో ఉద్యోగుల తొలగింపుపై సమాచారం అందించారు. మేనేజర్లు, వారిని నియంత్రించేందుకు మరికొంతమంది మేనేజర్లు, ఆ మేనేజర్లను మేనేజ్ చేసేందుకు ఇంకొంతమంది మేనేజర్లు.. ఇలా ఇన్ని స్థాయిల్లో మేనేజ్‌మెంట్ వ్యవస్థ అవసరమని తాను అనుకోవడం లేదని జుకర్‌బర్గ్ పేర్కొన్నట్టు తెలుస్తోంది.

గత ఏడాది నవంబర్‌లో కంపెనీ చరిత్రలో తొలిసారిగా అతిపెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. మెటా 13 శాతం ఉద్యోగులను తగ్గించుకుంది. ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా టెక్ కంపెనీలు ఆర్థిక మాద్యంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబరు చివరలో జుకర్‌బర్గ్ ఉద్యోగులను హెచ్చరించాడు. మెటా ఖర్చులు, షిఫ్ట్ టీమ్‌లను తగ్గించాలని యోచిస్తున్నట్టుగా ప్రకటించారు. ఆర్థిక మాంద్యం కారణంగా మెటా ఇంతకుముందు కొత్త నియామకాలను తగ్గించింది. ఆ తర్వాత తొలగింపులు ప్రారంభమయ్యాయి.

ఉద్వాసనతో మెట్ట ఉద్యోగాల ఆఫర్లను కూడా ఉపసంహరించుకుంటున్నట్లు సమాచారం. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాకు మెట్ట మాతృ సంస్థ. కంపెనీ ఆదాయంలో క్షీణత, డిజిటల్ పరిశ్రమలో సవాళ్లే ఈ నిర్ణయం వెనుక ఉన్నాయని మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఫిబ్రవరిలో ఉద్యోగంలో చేరిన వారి ఆఫర్ లెటర్లను META ఉపసంహరించుకుంది. Meta ఇప్పటికీ అనేక కంపెనీలలో తొలగింపులను చూస్తోంది. న్యూయార్క్‌లోని కార్యాలయాన్ని కూడా మూసివేయాలని కంపెనీ యోచిస్తోంది. ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగులను తొలగించడం తప్ప తమకు వేరే మార్గం లేదని కంపెనీ చెబుతోంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
థామా సెట్లోకి నేషనల్‌ క్రష్‌.. గేమ్‌చేంజర్‌‎ గురించి సుకుమార్‌..
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు హీరోయిన్
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
కుక్కతో రతన్ టాటా రూపంలో నిలువెత్తు కేక్.. ఆకర్షణగా మానవతామూర్తి
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
డీఎస్పీ సిరాజ్ @ 100.. MCGలో అత్యంత చెత్త రికార్డ్
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
వీడిన డెడ్ బాడీ పార్శిల్ మిస్టరీ..ఆ రెండో చెక్కపెట్టె ఎవరి కోసమో?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో..?
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
రప్ప రప్ప రికార్డుల మోత.. 21 రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
మైదానంలోకి దూసుకొచ్చిన ఫ్యాన్.. కోహ్లీ భుజంపై చేయివేసి డ్యాన్స్
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
కావ్యకు శత్రువులా మారిన స్వప్న.. రుద్రాణి ఆట ఆడేస్తుందిగా..
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై
అర్థనగ్నంగా తనపై తానే కొరడా ఝులిపించిన అన్నామలై