Girls Saving Schemes: ఆడబిడ్డల కోసం అద్భుతమైన పొదుపు పథకాలు.. భవిష్యత్ అవసరాలన్నీ తీర్చే బెస్ట్ ఆప్షన్స్..
అందుకే బిడ్డ పుట్టినప్పటి నుంచే ప్లానింగ్ అవసరం. ముఖ్యంగా వారి భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు మొదటి నుంచే ఎంతో కొంత సేవింగ్స్ ఉండటం ఉత్తమం. ఈ దిశగానే ఆలోచించిన ప్రభుత్వాలు కూడా మంచి రిటర్న్ లు వచ్చేలా పథకాలు ప్రవేశపెట్టాయి. ఆయా పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలను ఆర్జించవచ్చు.

ఇంటికి ఆడపిల్లే ఓ కళ. మహాలక్ష్మి అంటూ చాలా మంది సంబోధిస్తుంటారు. అయితే వారిని ఉన్నత చదువులు చదివించి, పెళ్లిళ్లు చేయడం ఈ రోజుల్లో చాలా ఖర్చుతో కూడకున్న పని. అందుకే బిడ్డ పుట్టినప్పటి నుంచే ప్లానింగ్ అవసరం. ముఖ్యంగా వారి భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు మొదటి నుంచే ఎంతో కొంత సేవింగ్స్ ఉండటం ఉత్తమం. ఈ దిశగానే ఆలోచించిన ప్రభుత్వాలు కూడా మంచి రిటర్న్ లు వచ్చేలా పథకాలు ప్రవేశపెట్టాయి. ఆయా పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలను ఆర్జించవచ్చు. ఈ నేపథ్యంలో ఆడబిడ్డల తల్లిదండ్రులకు అత్యధిక ప్రయోజనాలను చేకూర్చే పలు ప్రభుత్వ సేవింగ్స్ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
సుకన్యా సమృద్ధి యోజన..
ఆడపిల్లల భవిష్యత్ అవసరాలను తీర్చడంలో బాగా ఉపకరించే బెస్ట్ స్కీమ్ సుకన్యా సమృద్ధి యోజన(SSY). ఈ పథకాన్ని ఆడపిల్లను కలిగిన ప్రతి తల్లిదండ్రులు ఈ ఖాతాను తెరవవచ్చు. అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 10 ఏళ్ల లోపు వయసున్న పిల్లల పేరు మీద ఈ ఖాతాను తెరవొచ్చు. దీనిలో డిపాజిట్లు నెలవారీ లేదా సంవత్సరానికి ఒకసారి చొప్పున చెల్లించవచ్చు. ఇలా 15 సంవత్సరాలపాటు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో ప్రస్తుతం 7.6 శాతం వడ్డీని ప్రభుత్వం ఇస్తోంది. కనీసం రూ. 250 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. గరిష్టంగా ఏడాదికి రూ. 1.5 లక్ష వరకూ పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంది. కమర్షియల్ బ్యాంక్ లేదా పోస్టాఫీసులో ఈ ఖాతాను తెరవొచ్చు. సెక‌్షన్ 80 సీ కింద దీనిలో అసలు, వడ్డీపై ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది.
చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్..
మన దేశంలోని కేవలం ఆడ పిల్లల ఉద్దేశించిన మరో ఉత్తమ పథకం చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్. ఇది కొన్ని రుణ పరిమితులను కలిగి ఉంటుంది. పిల్లల పేరుమీద తీసుకొనే ఈ పథకం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)..
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) కూడా ప్రభుత్వ భరోసాతో వచ్చే సురక్షిత పెట్టుబడి పథకం. దీనిని పోస్టాఫీసులలో ప్రారంభించవచ్చు. ఇది బాలికల భవిష్యత్ అవసరాలకు బాగా ఉపయోగపడుతుంది.
పోస్ట్-ఆఫీస్ టర్మ్ డిపాజిట్..
బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ మాదిరిగానే పోస్ట్-ఆఫీస్ టర్మ్ డిపాజిట్ (POTD) ఉంటుంది. ఇది బాలికల భవిష్యత్ అవసరాలు తీర్చే మరో ఉత్తమ పథకం. దీనిలో ఒక ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల కాల వ్యవధితో పెట్టుబడి పెట్టొచ్చు. ఏడాది కాలవ్యవధికి 6.6%,, రెండేళ్లకు 6.8%, మూడేళ్లకు 6.9% ఐదేళ్లకు 7% వడ్డీని అందిస్తుంది.
యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ ప్లాన్..
యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేదా యులిప్, ఇది దేశంలోని ఆడ పిల్లల కోసం ప్రత్యేకించిన మరో ఉత్తమ పథకం. దీనిలో పెట్టుబడిని పెడితే అద్భుతమైన రాబడిని అందిస్తుంది. జీవిత బీమా కుండా ఉంటుంది.
CBSE ఉడాన్ పథకం..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) భారత ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి (HRD) మంత్రిత్వ శాఖ సహకారంతో ఆడపిల్లల కోసం CBSE ఉడాన్ పథకాన్ని ప్రారంభించింది. ఇది పిల్లల ఉన్నత చదువుకు ఉపకరిస్తుంది. ఈ పథకం బాలికలకు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విద్యా సౌకర్యాలను అందిస్తుంది. దీంతో పాటు వారికి స్టడీ మెటీరియల్, ప్రీలోడెడ్ టాబ్లెట్‌లు అందిస్తుంది. తద్వారా వారు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ప్రిపరేషన్‌ను పూర్తి చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..