ChatGPT: ఫేస్ బుక్, టిక్ టాక్ రికార్డులను తుడిచిపెట్టేసిన చాట్ జీపీటీ, రోజుల వ్యవధిలోనే 10 కోట్లు యూజర్లతో సెన్సేషన్

ఇంటర్ నెట్ స్పేస్ లో గత 20 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా ఈ చాట్ జీపీటీ వినియోగదారులకు దగ్గరవుతోందని యూబీఎస్ అనలిస్ట్స్ పేర్కొన్నారు. రెండు నెలల్లో 100 మిలియన్ల యూజర్లు రావడం ఓ అద్భుత రికార్డు.

ChatGPT: ఫేస్ బుక్, టిక్ టాక్ రికార్డులను తుడిచిపెట్టేసిన చాట్ జీపీటీ, రోజుల వ్యవధిలోనే 10 కోట్లు యూజర్లతో సెన్సేషన్
Chat Gpt
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 03, 2023 | 4:50 PM

చాట్ జీపీటీ.. ఇంటర్ నెట్ సర్కిళ్లలో ఈ పేరు పెద్ద సంచలనం. ఆఫీషియల్ గా లాంచ్ అయ్యి కేవలం రెండు నెలల కాలంలో తానేంటో ప్రపంచానికి చాటి చెపింది. ఏకంగా 100 మిలియన్ల యాక్టివ్ యూజర్లతో రికార్డు సృష్టించింది. యూబీఎస్ స్టడీ ప్రకటించిన లెక్కల ప్రకారం చాట్ జీపీటీ అత్యంత వేగంగా వినియోగదారులకు దగ్గరవుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా దూసుకుపోతోంది. డేటా అనలిటిక్స్ ప్రకారం ఒక రోజులో సగటున 13 మిలియన్ల మంది చాట్ జీపీటీ లోకి లాగిన్ అవుతున్నారు. ఇది జనవరి లెక్క. డిసెంబర్ తో పోల్చుకుంటే ఇది డబుల్. ఇంటర్ నెట్ స్పేస్ లో గత 20 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా ఈ చాట్ జీపీటీ వినియోగదారులకు దగ్గరవుతోందని యూబీఎస్ అనలిస్ట్స్ పేర్కొన్నారు. రెండు నెలల్లో 100 మిలియన్ల యూజర్లు రావడం ఓ అద్భుత రికార్డుగా పేర్కొన్నారు. ఇంత మంది యూజర్లు రావడానికి టిక్ టాక్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ యాప్ నకు తొమ్మిది నెలలు పట్టింది. అదే ఇన్ స్టా గ్రామ్ కి అయితే ఏకంగా రెండున్నరేళ్లు పట్టింది.

చాట్ జీపీటీ ఏం చేస్తుంది..

ఓపెన్ ఏఐ కంపెనీ లాంచ్ చేసిన ఈ చాట్ జీపీటీ అనే ఓ చాట్ బోట్ సెర్చ్ ఇంజిన్ లాంటిది. ఇది ఆర్టిపీషియల్ ఇంటెలెజెన్స్ తో పనిచేస్తుంది. దీని ద్వారా మనిషి చేయగలిగే ప్రతి విషయం అచ్చం మనిషిలాగే చేసే వీలుంటుంది. కంప్యూటర్ ప్రోగ్రాములు రాయడం, వాటిలోని తప్పులు(బగ్స్)ను గుర్తించి తొలగించడం కూడా ఇది చేస్తుంది. సంగీతాన్ని పొందుపరచడం, టెలివిజన్ నాటకాలు, కల్పిత కథలు రాయడం వంటివి చేసేస్తుంది. విద్యార్థులకు వ్యాసాలు రాయడమే కాకుండా పరీక్షల్లో ప్రశ్నలకు జవాబులను ఇస్తుంది. పాటలు కూడా రాస్తుంది. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ డేటా అనలిటిక్స్ తయార చేయడం, ఇలా ఒకటేమిటి సర్వజ్ఞానిలా అన్ని చేయగలుగుతుంది. నిలోని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అడిగిన సమాచారాన్ని ఎంతో కచ్చితంగా ఇస్తుంది. మనం తప్పుగా అడిగితే తప్పని చెబుతుంది. మనం అడిగే ప్రశ్నలకు మనిషిలా ఆలోచించి సమాధానాలు ఇస్తుంది.

అక్కడ యూసేజ్ చార్జి..

అమెరికాలోని యూజర్లకు చాట్ జీపీటీ సబ్ స్క్రిప్షన్ ఫీజును ప్రకటించింది. ప్రస్తుతానికి ఒక్క అమెరికాలో మాత్రమే దీనిని అమలు చేస్తోంది. నెలకు 20 డాలర్లను సబ్ స్క్రిప్షన్ ఫీజుగా పేర్కొంది. దీని ద్వారా మరింత వేగవంతమైన సేవలు అందించడంతో పాటు యూజర్లకు కచ్చితమైన డేటాను అందిస్తుంది. అలాగే కొత్త ఫీచర్లను వీరికి మాత్రమే అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో