AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Deactivation: వాట్సాప్ లో నిషేధాల జాతర.. లక్షల్లో ఖాతాలు డీయాక్టివేట్..

ఈ ఫీచర్ వినియోగదారులు వారి కాంటాక్ట్స్ ను త్వరగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నారు. తరచుగా వాడే కాంటాక్ట్స్ కు ఈజీగా కాల్స్ చేయడానికి అనుకూల షార్ట్‌కట్‌లను సెటప్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.

WhatsApp  Deactivation: వాట్సాప్ లో నిషేధాల జాతర.. లక్షల్లో ఖాతాలు డీయాక్టివేట్..
Whatsapp
Nikhil
|

Updated on: Feb 03, 2023 | 5:30 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన మేసేజింగ్ యాప్స్ వాట్సాప్ ప్రథమ స్థానంలో ఉంటుంది. వాట్సాప్ అందుబాటులోకి ఫోన్ ద్వారా పంపే సాధారణ టెక్ట్స్ మెసేజ్ పంపడం దాదాపుగా ఆగిపోయింది. వయస్సుతో సంబంధం లేకుండా అందరూ వాట్సాప్ ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ఆదరణ చూసిన మిగిలిన కంపెనీలు తమ కార్యకలాపాలను వాట్సాప్ గ్రూప్స్ ద్వారా చేస్తున్నాయంటే వాట్సాప్ ఎంత విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే వాట్సాప్ ద్వారా ఎంత మంచి జరిగిందో అదే రీతిలో చెడు కూడా జరిగింది. ముఖ్యంగా నకిలీ వార్తలు వాట్సాప్ లో ఫార్వార్డ్ చేయడంతో నిజమనుకునే వారు ఇప్పటికీ ఉన్నారు. ముఖ్యంగా గ్రామాల్లోని వారు వాట్సాప్ లో మెసెజ్ వస్తే అది నిజమనుకుంటారు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి వాట్సాప్ వివిధ చర్యలు తీసుకుంది. నకిలీ వార్తలను కట్టడి చేయడానికి భారతదేశంలో కూడా ప్రభుత్వం కూడా కఠినమైన నిబంధనలు సూచించింది. ఈ నేపథ్యంలో వాట్సాప్ తన ఖాతాలను డీయాక్టివేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ నివేదిక ప్రకారం భారతదేశంలో 36.77 లక్షల ఖాతాలను వాట్సాప్ నవంబర్ లో నిషేధించింది. అయితే డిసెంబర్ 37.16 లక్షల ఖాతాలను నిషేధించింది. ఇందులో 9.9 లక్షల ఖాతాలు ముందుగానే నిషేధించినవి ఉన్నాయి. గత సంవత్సరం అమల్లోకి వచ్చిన కఠినమైన ఐటీ నిబంధనల కారణంగా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ తమ ఖాతాదారులపై కొరడా ఝళిపిస్తున్నాయి. విద్వేషపూరిత ప్రసంగాలు, తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు వంటి వివిధ కేటగిరీల్లో తమ ఖాతాదారులను హెచ్చరించి మరీ ఖాతాను డీయాక్టివేట్ చేస్తున్నాయి. అయితే ఇలా ఏకపక్షంగా ఖాతాలను డీ యాక్టివేట్ చేయడంతో వినియోగదారులు మండిపడుతున్నారు. 

వాట్సాప్ లో సరికొత్త ఫీచర్

ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్, ఆండ్రాయిడ్ యూజర్లు సులభంగా కాల్స్ చేసుకునేందుకు సహాయపడే కొత్త ఫీచర్‌పై తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ ఫీచర్ యాప్‌ ను ఓపెన్ చేయకుండానే  కాల్స్ చేసుకోడానికి వినియోగదారులను అనుమతిస్తుందని తెలుస్తోంది. ఈ ఫీచర్ వినియోగదారులు వారి కాంటాక్ట్స్ ను త్వరగా యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నారు. తరచుగా వాడే కాంటాక్ట్స్ కు ఈజీగా కాల్స్ చేయడానికి అనుకూల షార్ట్‌కట్‌లను సెటప్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. దీంతో యూజర్లు త్వరగా కాల్స్ చేసుకోవచ్చు. వెబిటా ఇన్ ఫో నివేదిక ప్రకారం కాల్స్ ను మెసేజ్‌లు పంపినంత సులువుగా చేయడానికి వాట్సాప్ ప్లాన్ చేస్తోంది. కాలింగ్ షార్ట్‌కట్ ఫీచర్ కాంటాక్ట్ లిస్ట్‌లోని కాంటాక్ట్ ను సెలెక్ట్ చేయడం ద్వారా వినియోగదారులకు కాలింగ్ సులభతరం చేసే అవకాశం ఉంది. అలాగే ఈ కొత్త ఫీచర్ ఆటోమెటిక్ ఫోన్ హోం స్క్రీన్ లో కనిపించేలా చర్యలు తీసుకుంటుందని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..