Whatsapp Call Record: వాట్సాప్ కాల్‌ను ఎలా రికార్డు చేసుకోవాలో తెలియటం లేదా..? ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వండి.
Whatsapp Call Record: ఇటీవల ప్రతీ ఒక్కరూ తాము ఫోన్‌లో ఇతరులతో మాట్లాడేదాన్ని రికార్డు చేసుకుంటున్నారు. సేఫ్ సైడ్ కోసమనో, సాక్ష్యం కోసమో కాల్స్‌ను రికార్డు చేస్తున్నారు. ఇందుకోసమే కొన్ని ప్రత్యేక...
Whatsapp Call Record: ఇటీవల ప్రతీ ఒక్కరూ తాము ఫోన్‌లో ఇతరులతో మాట్లాడేదాన్ని రికార్డు చేసుకుంటున్నారు. సేఫ్ సైడ్ కోసమనో, సాక్ష్యం కోసమో కాల్స్‌ను రికార్డు చేస్తున్నారు. ఇందుకోసమే కొన్ని ప్రత్యేక యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. చివరికి యాప్ కనిపించకుండా కాల్ దానంతట అదే రికార్డు అయ్యే యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉంటే మనకు తెలిసినంత వరకు కేవలం కాల్ నెట్‌వర్క్ ద్వారా మాట్లాడే కాల్స్‌ను మాత్రమే రికార్డు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇటీవల వాట్సాప్ కాల్స్ వాడుతోన్న వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోతోంది. కానీ వాట్సాప్‌లో మాట్లాడే కాల్స్‌ను రికార్డు చేసుకునే సదుపాయం లేదు. ఇది మనందరికీ తెలిసిందే. మరి వాట్సాప్ కాల్స్‌ను కూడా రికార్డు చేసుకునే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ..! అయితే ఇందుకోసం ఓ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే సరిపోతుంది.
వాట్సాప్‌లో రికార్డు కోసం ఇన్‌బిల్డ్‌గా ఎలాంటి ఆప్షన్ లేకపోయినప్పటికీ.. థర్డ్ పార్టీ యాప్ ద్వారా వాయిస్ కాల్స్ రికార్డు చేసుకోవచ్చు. అయితే వాట్సాప్‌లో ఫోన్ మాట్లాడే సమయంలో స్పీకర్‌ను తప్పనిసరిగా ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం క్యూబ్ కాల్ అనే యాప్ అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా సిగ్నల్, స్కైప్, వైబర్, వాట్సాప్, హంగవుట్స్, ఫేస్‌బుక్, ఐఎంవో, వీచాట్.. ఇలా వేటి నుంచైనా వాయిస్ కాల్ రికార్డు చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్లేస్టోర్‌లో ఉండే గూగుల్ రికార్డర్ యాప్‌ను ఉపయోగించి కూడా కాల్స్ రికార్డు చేసుకోవచ్చు.
Health Tips: గొంతు నొప్పి.. నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..? ఇలా చేయండి.. వెంటనే నయమవుతుంది..!