JioMeet: భారతీయుల కోసం జియోమీట్‌లో మార్పులు.. ఇక ప్రాంతీయ భాషల్లోనూ యాప్‌ అందుబాటులోకి.

JioMeet: కరోనా తదనంతర పరిస్థితుల తర్వాత ఆన్‌లైన్‌ వీడియా కాలింగ్‌కు ఆదరణ బాగా పెరిగింది. ఆన్‌లైన్‌ క్లాసుల నుంచి మొదలు పెడితే.. ఉద్యోగుల వరకు అందరూ వీడియో కాలింగ్‌ ద్వారానే సమాచారాన్ని..

JioMeet: భారతీయుల కోసం జియోమీట్‌లో మార్పులు.. ఇక ప్రాంతీయ భాషల్లోనూ యాప్‌ అందుబాటులోకి.
Jiomeet Features
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 26, 2021 | 7:24 AM

JioMeet: కరోనా తదనంతర పరిస్థితుల తర్వాత ఆన్‌లైన్‌ వీడియా కాలింగ్‌కు ఆదరణ బాగా పెరిగింది. ఆన్‌లైన్‌ క్లాసుల నుంచి మొదలు పెడితే.. ఉద్యోగుల వరకు అందరూ వీడియో కాలింగ్‌ ద్వారానే సమాచారాన్ని మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలు సంస్థలు రకరకాల యాప్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే గూగుల్‌ మీట్‌, జూమ్‌ వంటి సంస్థలు ఈ రేసులో ముందు వరుసలో ఉన్నాయి. అయితే ఈ విదేశీ కంపెనీలకు పోటీగా భారత్‌కు చెందిన జియో కూడా జియోమీట్‌ పేరుతో వీడియో కాలింగ్‌ యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జియో భారతీయుల అవసరాలకు అనుగుణంగా స్థానిక భాషల్లో ఈ యాప్‌ను ఉపయోగించే విధంగా జియోమీట్‌లో పలు మార్పులు చేసింది.

జియో నెట్‌వర్క్‌ తీసుకొచ్చిన ఈ యాప్‌ను గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎక్కువ మందిని ఆకర్షించే విధంగా ఇంగ్లిష్‌తో పాటు స్థానిక భాషల్లో జియోమీట్‌ను ఉపయోగించుకునేలా మార్పులు చేశారు. ఇందులో భాగంగానే ఆగస్టు 15 నుంచి హింది, మరాఠి, గుజరాత్‌ భాషలను ఈ యాప్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషలను కూడా జోడించనున్నట్లు జియో సంస్థ తెలిపింది. ఇక జియోమీట్‌లో మరో అద్భుత ఫీచర్‌ను కూడా తీసుకొచ్చారు. అదే డేటా సేవర్‌.. సాధారణంగా వీడియో కాల్స్‌ వల్ల ఎక్కువగా డేటా వినియోగం జరుగుతుంది. కానీ జియోమీట్‌తో డేటా వినియోగం తక్కువ ఉండేలా డిజైన్‌ చేశారు. తక్కువ డేటాతోనే మంచి క్లారిటీతో ఆన్‌లైన్‌ క్లాసులు, వర్చువల్‌ మీటింగ్స్‌ హాజరుకావొచ్చని జియో చెబుతోంది.

Also Read: Health Tips: గొంతు నొప్పి.. నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..? ఇలా చేయండి.. వెంటనే నయమవుతుంది..!

Suicide: ‘అమ్మా.. నాన్న నన్ను క్షమించండి. మీ మాట నిలబెట్టుకోలేకపోయాను’… ఎంసెంట్‌లో క్వాలిఫై కాకపోవడంతో..

E-Shram Portal: అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక పోర్టల్.. ఈ-శ్రమ్‌ను ఆవిష్కరించనున్న కేంద్రం..