- Telugu News Photo Gallery Technology photos Realme Launch New Smartphone GT 5G In Indian Market Have Look On Features And Price Details
Realme GT 5G: భారత మార్కెట్లో విడుదలైన రియల్ మీ జీటీ 5జీ.. 64 మెగాపిక్సెల్స్‌తో అదిరి పోయే కెమెరా.
Realme GT 5G: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ దిగ్గజం రియల్ మీ తాజాగా భారత మార్కెట్లో జీటీ 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. రెండు రకలా స్టోరేజ్ వేరియేషన్లలో విడుదల చేసిన ఈ ఫోన్ బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.
Updated on: Aug 25, 2021 | 12:16 PM

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో రోజుకో కొత్త ఫోన్‌ను విడుదల చేస్తూ దూసుకొస్తున్న రియల్ మీ తాజాగా జీటీ 5జీ పేరుతో బుధవారం మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది.

రియల్ మీ జీటీ 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్ ధర రూ. 37,999 కాగా 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 41,999గా ఉంది. ఈ ఫోన్‌లను ఫ్లిప్‌కార్టు, రియల్‌మీ ఇండియా అధికారిక వెబ్‌సైట్లలో కొనుగోలు చేయొచ్చు.

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 888 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌ను ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ. 3000 డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్‌పై 20 శాతం డిస్కైంట్ పొందొచ్చు.

ఈ ఫోన్‌లో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ + సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు.

ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు.

5జీ నెట్‌వర్క్ సపోర్ట్ చేసే ఈ ఫోన్‌లో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు 65 వాట్స్ సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.





























