- Telugu News Photo Gallery Technology photos Huge Discount On Apple Iphones And MacBook FlipKart Apple Days Sale Is On Live
Flipkart Apple day sale: యాపిల్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే వెంటనే త్వరపడండి. భారీ డిస్కౌంట్‌లు ఉన్నాయి.
Flipkart Apple day sale: యాపిల్ ఫోన్‌లు, మ్యాక్‌బుక్, స్మార్ట్ వాచ్‌లపై ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఫ్లిప్‌కార్ట్ యాపిల్ డే సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన మోడళ్లను తగ్గింపు ధరకు అందిస్తున్నారు. ఆఫర్‌లో భాగంగా అందుబాటులో ఉన్న కొన్ని ఫోన్‌ల వివరాలు మీకోసం..
Updated on: Aug 26, 2021 | 10:38 AM

యాపిల్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. ఫ్లిప్‌కార్ట్ యాపిల్ డే సేల్‌లో భాగంగా ఐఫోన్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ సేల్ ఆగస్టు 28న ముగియనుంది

ఐఫోన్ 12 మినీపై గరిష్టంగా రూ. 8000 వరకు డిస్కౌంట్ అందిస్తోంది. లాంచ్ ప్రైజ్‌లో భాగంగా రూ. 69,900 ఉన్న ఈ ఫోన్‌ను రూ. 61,900కి తగ్గించారు. ఇక ఫ్లిప్‌కార్ట్ యాపిల్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌పై అదనంగా రూ. 2000లతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 6000 డిస్కౌంట్‌కి లభిస్తుంది.

అదే విధంగా ఐఫోన్ 12 ప్రో పై గరిష్టంగా రూ. 8000 డిస్కౌంట్ అందుతోంది. లాంచ్ ప్రైజ్‌లో భాగంగా రూ. 1,29,900 ఉన్న ఫోన్‌ను రూ. 1,20,900కి లభిస్తోంది. ఇక ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా మరో రూ. 4000లతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు రూ. 5000 డిస్కౌట్ లభిస్తుంది.

ఐఫోన్ 11 ధరను రూ. 51,999 నుంచి రూ. 54,900కి తగ్గించారు. సిటీ క్రెడిట్ కార్డ్స్ ద్వారా రూ. 750 డిస్కౌంట్ లభిస్తుంది. ఐఫోన్ ఎక్స్‌ఆర్ ధర రూ. 41,999గా ఉండగా రూ. 47,900కి అందిస్తున్నారు.

ఐఫోన్ 11 ప్రో ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా రూ. 74,999కి లభిస్తుంది. ఇక ఐఫోన్ ఎస్‌ఈ 2020 128 జీబీ రూ. 34,999కి లభిస్తోంది.

కేవలం స్మార్ట్ ఫోన్‌ల కాకుండా మాక్‌బుక్ ఏయిర్ ఎమ్1పై ఏకంగా రూ. 10000 డిస్కౌంట్ అందుతోంది. ఇక యాపిల్ వాచ్ సిరీస్ 6పై డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ వాచ్ రూ. 37,900కి అందుబాటులో ఉంది.





























