- Telugu News Photo Gallery Technology photos Have Look On Top Mileage Electric Scooter Here Some Scooters List
ఈ స్కూటర్‌ను మూడు సార్లు ఫుల్ చార్జ్ చేస్తే.. నెలపాటు ఆఫీసుకు వెళ్లిరావొచ్చు. టాప్ 5 మైలేజ్ స్కూటర్లపై ఓ లుక్కేయండి.
Electric Scooters: ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం బాగా పెరుగుతోంది. ఇంధన ధరలు పెరుగుతుండడంతో ప్రజలు విద్యుత్ ఆధారంగా నడిచే వాహనాలపై దృష్టిసారిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒక్కసారి చార్జ్ చేస్తే అత్యధిక మైలేజ్ ఇచ్చే కొన్ని స్కూటర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Aug 27, 2021 | 9:43 AM

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ జోరందుకుంటోంది. ఇంధన ధరలు పెరుగుతుండడంతో ప్రజలు కూడా విద్యుత్‌తో నడిచే వాహనాలను వాడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన కొన్ని టాప్ మైలేజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు ఓసారి చూద్దాం.

ఓలా ఎస్ 1, ఎస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ఇటీవలే భారత్‌లో లాంచ్ అయ్యింది. ఈ కంపెనీలో ఎస్1 బేస్ వేరియంట్, ఎస్1 ప్రో టాప్ వేరియంట్ విడుదల చేసింది. బేస్ వేరియంట్ ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 121 కి.మీలు, టాప్ వేరియంట్‌లో 181 కి.మీలు దూసుకొల్లొచ్చు. అంటే మీరు రోజుకు 20 కి.మీలు ప్రయాణిస్తుంటే నెల రోజులకు కేవలం మూడు సార్లు చార్జ్ చేసుకుంటే చాలన్నమాట.

ఒడిస్సీ హాక్ ప్లస్ స్కూటర్‌ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 170 కిలోమీటర్లు నాన్‌స్టాప్‌గా వెళ్లొచ్చు. ఇది ఫుల్ చార్జ్ కావడానికి 4 గంటల సమయం పడుతుంది. అంతేకాకుండా ఏదైనా త్రిపిన్ ప్లగ్ సాకెట్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు.

హీరో ఎలక్ట్రిక్ నైక్స్ హెచ్‌జెడ్ స్కూటర్ వేగంగా దూసుకెళుతుంది. దీనిని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే నాన్ స్టాప్‌గా 165 కిలోమీటర్లు వెళుతుంది. దీంట్లో 51.2V/30Ah డ్యూయల్ బ్యాటరీని అందించారు.

ఒకినావా ఐ-ప్రైజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను గురుగ్రామ్‌లో తయారు చేస్తున్నారు. ఈ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 139 కిలో మీటర్లు వెళుతుంది. ఇందులో 3.3kWh లిథియం-అయాన్ బ్యాటరీని అందించారు.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 90 కి.మీలు దూసుకెళుతుంది. పుణేలో తయారీ అవుతోన్న ఈ స్కూటర్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది.





























