Health Tips: గొంతు నొప్పి.. నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..? ఇలా చేయండి.. వెంటనే నయమవుతుంది..!
Health Tips: ప్రస్తుతమున్న రోజుల్లో చాలా మంది ఏదో ఒక అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ముందే కరోనా కాలం ఇంకా పలు వ్యాధులు వెంటాడుతుంటాయి..
Health Tips: ప్రస్తుతమున్న రోజుల్లో చాలా మంది ఏదో ఒక అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ముందే కరోనా కాలం ఇంకా పలు వ్యాధులు వెంటాడుతుంటాయి. అయితే కొన్ని ఇంట్లోనే దొరికే వాటితోనే కొన్ని వ్యాధులను దూరం చేసుకోవచ్చు.. వచ్చిన వ్యాధులను ఆదుపులో పెట్టుకోవచ్చు. దీని కారణంగా ఆస్పత్రికి వెళ్లే అవకాశం ఉండదు. ఇక ఈ విషయం అటుంచితే తులసి మొక్క గురించి తెలుసుకుందాం. ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దాదాపు ఇది అందరికి తెలిసిందే. ఈ తులసి ఆకులను ఏ రూపంలో తీసుకున్నా.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇక గొంతునొప్పి, నోటి దుర్వాసన, నోట్లో పొక్కులు లాంటి ఎన్నో సమస్యలు చాలా మందిని వెంటాడుతుంటాయి. దీంతో ఆస్పత్రులకు వెళ్లడం, మందుల కోసం అధికంగా ఖర్చు చేసుకోవడం చేస్తుంటారు. కానీ తులసి ఆకుల ద్వారా ఈ సమస్యలను పోగొట్టుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మరి తులసి వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకుందాం.
చాలామందిని నోటి దుర్వాసన సమస్య వేధిస్తుంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు ప్రతి రోజు రాత్రి నీళ్లల్లో తులసి ఆకులను నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటితో పళ్లు తోముకోవాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన సమస్య పోతుంది. అలాగే కొందరికి నోట్లో పొక్కులు వస్తుంటాయి. అలాంటి సమస్య కూడా తులసి వల్ల నయం అవుతుంది.
ఇక గొంతు నొప్పి కూడా చాలా మందిలో ఉంటుంది. వారికి ఇది పెద్ద సమస్యగా ఉంటుంది. అలాంటి వారికి కూడా తులసి ఎంతో మేలు చేస్తుంది. గొంతునొప్పి ఉన్నవారు ఏదైనా పదార్థాన్ని మింగినా తీవ్రమైన నొప్పి వస్తుంది. కొన్ని సందర్బాల్లో అయితే మంచినీళ్లను మింగాలన్నా గొంతు నొప్పి వేధిస్తుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు నీళ్లలో తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీళ్లు గోరువెచ్చగా మారగనే తాగాలి. దాంతో గొంతునొప్పి మటుమాయం అవుతుంది.
ఇంకా తులసి రసంలో తేనె కలిపి తీసుకుంటే కూడా మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ రెండింటిలోనూ యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉండటంవల్ల చర్మ సమస్యలు వెంటాడవు. సాధారణ జలుబు, దగ్గు కూడా తగ్గుతాయి. నోటిపూతకు కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. తులసి ఆకులకు శరీరంలో కొవ్వును తగ్గించే గుణం కూడా ఉంటుంది. తులసి ఆకులను ప్రతిరోజూ క్రమం తప్పకుండా మజ్జిగతో కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు. ఇక నిద్రలేమితో బాధపడేవారు తులసి ఆకులను చక్కెరతో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇవే కాకుండా తులసి ఆకులు శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. అందుకే క్రమం తప్పకుండా తులసి ఆకులను తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.