Suicide: ‘అమ్మా.. నాన్న నన్ను క్షమించండి. మీ మాట నిలబెట్టుకోలేకపోయాను’… ఎంసెంట్‌లో క్వాలిఫై కాకపోవడంతో..
Suicide: చిన్న క్షణికావేశం నిండు జీవితాన్ని బలి తీసుకుంటుంది. జీవితంలో అనుకున్నది దక్కలేదని, కోరుకున్నది సాధించలేమని.. చిన్న చిన్న కారణాలకు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా నల్లగొండ జిల్లాలో...
Suicide: చిన్న క్షణికావేశం నిండు జీవితాన్ని బలి తీసుకుంటుంది. జీవితంలో అనుకున్నది దక్కలేదని, కోరుకున్నది సాధించలేమని.. చిన్న చిన్న కారణాలకు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా నల్లగొండ జిల్లాలో చోటు చేసుకున్న ఓ సంఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. నల్లగొండ జిల్లా కనగల్ మండలం శాబ్థుల్లాపురానికి చెందిన కోయ రవీందర్ రెడ్డి, అరుణ దంపతులకు స్నేహా రెడ్డి (17) కూతురు. ఆమె ఇటీవల జరిగిన తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ పరీక్షలకు హాజరైంది. అయితే బుధవారం విడుదలైన ఫలితాల్లో స్నేహా రెడ్డి అర్హత సాధించలేకపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి చెందిన స్నేహా ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది.
తల్లి ఏఎన్‌ఎంగా విధులు నిర్వర్తిస్తోంది. ఇందులో భాగంగా ఆమె పనిపై కురంపల్లికి వెళ్లింది. ఇంట్లో ఉన్న తమ్ముడుని అమ్మను తీసుకురామ్మని బయటకు పంపించిన స్నేహా.. ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే అదే సమయంలో పొలం పనులు పూర్తిచేసుకొని ఇంటికి వచ్చిన తండ్రి.. కూతురు ఇంట్లో ఉరేసుకుని ఉందన్న విషయాన్ని తెలియక బయటే కూర్చున్నాడు. అంతలోనే స్నేహా తమ్ముడు… తల్లిని తీసుకొని వచ్చాడు. దీంతో అంతా కలిసి ఇంట్లోకి వెళ్లే సరికి స్నేహా అప్పటికే కొన ఊపిరితో ఫ్యానుకు వెళాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందకి దించినప్పటికీ ఆలస్యం కావడంతో స్నేహా ప్రాణాలను విడిచింది. దీంతో తల్లి దండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కూతురు కళ్ల ముందే విగత జీవిగా మారడంతో గుండెలు పగిలేలా రోదించారు.
సమాజాన్ని ప్రశ్నిస్తోన్న ఆత్మహత్య లేఖ..
ఇక స్నేహా రెడ్డి ఆత్మహత్య చేసుకునే సమయంలో రాసిన లేఖ సమాజానికి ఎన్నో ప్రశ్నలను సంధిస్తోంది. అసలు ర్యాంకులు రాకపోతే జీవితమే లేదన్నట్లు సమాజం విద్యార్థులపై పెంచుతోన్న ఒత్తిడే ఇలాంటి వాటికి కారణాలుగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. స్నేహారెడ్డి ఆత్మహత్య లేఖలో ‘అమ్మా నాన్న నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని ఫేస్ చేయలేను. మీకు నా మీద చాలా నమ్మకం ఉంది, కానీ నేను అది నిలబెట్టుకోలేకపోయాను. నేను ఎంసెట్‌లో క్వాలిఫై కాలేదు. మీరు నాకు మంచి ర్యాంకు వస్తుందని అనుకున్నారు. మీకు నా మొహాన్ని ఎలా చూపించుకోవాలో అర్ధం అవ్వట్లేదు. అందుకే ఇలా చేస్తున్నా. నన్ను క్షమించండి’ అంటూ రాసిన అంశాలు ఎన్నో ప్రశ్నలు మిగిలిస్తున్నాయి.
Mysore Gang Rape: రెచ్చిపోయిన మానవ మృగాలు.. స్నేహితుడిని చితకబాది, విద్యార్థినిపై సామూహిక అత్యాచారం