BoB Kalikiri: డిపాజిటర్ల సొమ్ము మాయం.. భార్య ఖాతాల్లోకి మళ్లించిన బ్యాంక్ ఉద్యోగి..
చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడా లో డిపాజిట్ల సొమ్ము మాయమయ్యాయి. దాదాపు మూడు కోట్ల రూపాయలకు పైగానే స్వాహా చేసినట్లు నిర్ధారణ అయ్యింది. మెసెంజర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ అలీఖాన్ తన భార్య పేరుతో ఉన్న ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నగదు మళ్లించినట్టు వెల్లడైంది.

చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడా లో డిపాజిట్ల సొమ్ము మాయమయ్యాయి. దాదాపు మూడు కోట్ల రూపాయలకు పైగానే స్వాహా చేసినట్లు నిర్ధారణ అయ్యింది. పొదుపు సంఘాలు, వ్యక్తిగత ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్మును సిబ్బంది కాజేసినట్లుగా తెలుస్తోంది. 15 ఏళ్లుగా తాత్కాలిక మెసెంజర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి కొందరు బ్యాంక్ ఉద్యోగుల సహకారంతో భార్య ఖాతాలోకి నగదు ట్రాన్స్ ఫర్ చేసిన వైనం తాాజాగా వెలుగులోకి వచ్చింది. పొదుపు సంఘాలు తమ ఖాతాలోనే డబ్బు మాయమైందని తెలియడంతో కలికిరి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. మహిళా సంఘాలకు చెందిన సొమ్ము పెద్దమొత్తంలో స్వాహా చేసినట్లు గుర్తించి సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు వెలుగు సిబ్బంది.
అసలు ఏం జరిగిందంటే…
చిత్తూరు జిల్లా కలికిరి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్‌లో రూ.3 కోట్లు మాయమయ్యాయి. తాత్కాలిక ఉద్యోగి తన భార్య ఖాతాల్లోకి నగదు మళ్లించాడు. దీనిపై విచారణ కొనసాగుతోంది. దాదాపు 150 డ్వాక్రా సంఘాలకు చెందిన ఖాతాల నుంచి కోటిన్నర వరకూ ఖాళీ చేసినట్టు వెలుగు అధికారులు అంచనాకు వచ్చారు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా స్వాహా చేసినట్లు తెలుస్తోంది.
మహిళా సంఘాల ఖాతాల్లో నుంచి సిబ్బంది పెద్దమొత్తంలో కాజేశారని, విచారణ చేయించాలని కోరుతూ వెలుగు అధికారులు డీఆర్‌డీఏ పీడీకి నివేదిక పంపారు. విషయం బయటకు రాగానే బ్యాంకు ఉన్నతాధికారులు అంతరంగిక విచారణ జరిపి, మేనేజరుతో పాటు ఒకరిద్దరు ఉద్యోగులను బదిలీచేశారు.
బ్యాంకులో తాత్కాలిక మెసెంజర్‌గా పనిచేస్తున్న అబ్దుల్ అలీఖాన్ తన భార్య పేరుతో ఉన్న ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నగదు మళ్లించినట్టు వెల్లడైంది. తాత్కాలిక మెసెంజర్‌పై చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి: Viral Video: హడావిడిగా రైల్వే గేట్ దాటడానికి ప్రయత్నించాడు.. అప్పుడేం జరిగిందో చూస్తే.. మీరు కూడా ఆశ్చర్యపోతారు..