TRS MP Maloth Kavitha Dance: ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన ఓ పాట విపరీతంగా వినిపిస్తుంది. నీ బుల్లెట్టు బండెక్కి అనే ఫోక్ సాంగ్ ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది. ఓ పెళ్ళిలో పెళ్లికూతురు ఈ పాటకు డాన్స్ వేయడంతో పాట బాగా పాపులర్ అయ్యింది. ఇక కుర్రకారును ఉరకలేపిస్తూ.. ఆడపడుచుల్లో ఆనందం ఉప్పొంగి స్టెప్పులేసేలా చేస్తున్న బుల్లెట్ బండి సాంగ్ వింటే సామాన్యులకే కాదు ప్రజాప్రతినిధులకు కూడా కాలు నిలవడం లేదు… ఆనందంతో స్టెప్పులేస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత డ్యాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.. నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా అనే పాటకు స్వరం కలుపుతూ – పాదం కదుపుతూ ఓ పెళ్లి వేడుకలో ఇలా స్టెప్పు లేశారు. ఈ పెళ్లి వేడుక మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది.. TRS నాయకుడు ముత్యం వెంకన్న కుమారుడి వివాహ వేడుకలకు హాజరైన ఎంపీ కవిత ఈ పాట వినగానే పూనకం వచ్చినట్లు ఊగిపోయారు.. ఇలా పెళ్లి వేదిక పైనే వధూవరులతో కలిసి స్టెప్పులేశారు..
ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో ఈ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.. ఎక్కడ చూసినా ఇదే సాంగ్ షేక్ చేస్తుంది.. సామాన్యులతో పాటు ఇలాంటి ప్రజాప్రతినిధులను కూడా షేక్ చేయడం సమ్‌థింగ్ స్పెషల్ గా మారింది.. ఈ పెళ్ళి వేడుకలో పాల్గొన్న వారంతా ఎంపీ కవిత బుల్లెట్ డ్యాన్స్ చూసి కేక పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.