Poco X5 Phone: పోకో ఎక్స్ 5 ఫోన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అద్భుతమైన డిజైన్.. మతిపోయే ఫీచర్స్ ఇవే..
పోకో కంపెనీ తన బ్రాండ్ ఎంబాసిడర్ క్రికెట్ ఆటగాడు హార్థిక్ పాండ్యా ఉన్నఓ టీజర్ ను ఇటీవల విడుదల చేసింది. పోకో ఎక్స్ 5 ధర విషయం చెప్పనప్పటికి ఫిబ్రవరి 6న లాంచ్ చేస్తున్నట్టు టీజర్ లో తెలిపింది.
స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి మరో కొత్త ఫోన్ ను పోకో కంపెనీ రిలీజ్ చేయనుంచి పోకో ఎక్స్ 4 ప్రోకు కొనసాగింపుగా పోకో ఎక్స్ 5 ను రిలీజ్ చేస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. పోకో ఎక్స్ 5 ప్రో, పోకో ఎక్స్ 5 5జీ వెరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. పోకో కంపెనీ తన బ్రాండ్ ఎంబాసిడర్ క్రికెట్ ఆటగాడు హార్థిక్ పాండ్యా ఉన్నఓ టీజర్ ను ఇటీవల విడుదల చేసింది. పోకో ఎక్స్ 5 ధర విషయం చెప్పనప్పటికి ఫిబ్రవరి 6న లాంచ్ చేస్తున్నట్టు టీజర్ లో తెలిపింది. పోకో ఎక్స్ 5 ఫోన్ ఇంచుమించి రెడ్ మీ 12 స్పీడ్ వెర్షన్ గా ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తన పాత మోడల్స్ కు అనుగుణంగా వెనుక వైపు కెమెరా హంప్ తో వస్తుంది. ఫుల్ ఫ్లాట్ ఎడ్జ్ డిజైన్ తో ఈ ఫోన్ కచ్చితంగా వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
పోకో ఎక్స్ 5 ఫీచర్లు ఇవే
పోకో ఎక్స్ 5 ప్రో ఫోన్ 108 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్, స్నాప్ డ్రాగన్ 778 ప్రాసెసర్, 120 హెచ్ జెడ్ ఎమోఎల్ఈడీ డిస్ ప్లే, 67 వాట్స్ స్పీడ్ చార్జింగ్ కెపాసిటీ తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే పోకో ఎక్స్ 5 5 జీ ఫోన్ లో 48 ఎంపీ కెమెరా సెటప్, స్నాప్ డ్రాగన్ 668 ప్రాసెసర్, 120 హెచ్ జెడ్ ఎమోఎల్ఈడీ డిస్ ప్లే, 33 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే పోకో ఎక్స్ 5 ప్రో 6 జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.21, 000, 8 జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.23,000 గా ఉంటుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి