Green Comet 2023: వినీలాకాశంలో అద్భుతం.. భూమికి చేరువగా కనువిందు చేసిన ఆకుపచ్చ తోకచుక్క..
వినీలాకాశంలో అద్భుతం జరిగింది. సౌర కుటుంబానికి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే ఆకుపచ్చ తోకచుక్క భూమికి చేరువగా వచ్చింది. ఊర్ట్ అనే రహస్య ప్రాంతం నుంచి బయల్దేరిన తోక చుక్క నిన్న భూమికి దగ్గరగా వచ్చింది.
వినీలాకాశంలో అద్భుతం జరిగింది. సౌర కుటుంబానికి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే ఆకుపచ్చ తోకచుక్క భూమికి చేరువగా వచ్చింది. ఊర్ట్ అనే రహస్య ప్రాంతం నుంచి బయల్దేరిన తోక చుక్క నిన్న భూమికి దగ్గరగా వచ్చింది. అయితే ఈ అరుదైన దృశ్యం కొన్ని దేశాల ప్రజలకు మాత్రమే కనువిందు చేసింది. ఉత్తరార్థ గోళంలోని కొన్ని దేశాల ప్రజలకే ఈ దృశ్యం కనిపించిందని నాసా తెలిపింది. ఆ దేశ ప్రజలు ఈ ఆకుపచ్చ తోకచుక్కను కన్నులారా వీక్షించారు.
గత ఏడాది మొదటిసారి జూపిటర్ గ్రహాన్ని దాటుకుని వెళుతుండగా శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌర వ్యవస్థలో మంచు ప్రాంతాలను దాటుకుంటూ జనవరి 12న సూర్యుడికి దగ్గరగా వచ్చింది ఈ తోకచుక్క. నిన్న భూమికి చేరువగా వచ్చింది. 50 వేల ఏళ్ల తర్వాత ఈ తోకచుక్క భూమికి దగ్గరగా వచ్చింది. ఈ సమయంలో రెండింటి మధ్య దూరం 42 మిలియన్ కిలోమీటర్లు ఉంటుందని నాసా అంచనా వేసింది. భూమికి సమీపంగా వచ్చిన సమయంలో దీని కాంతి చాలా ప్రకాశవంతంగా కనిపించిందని తెలిపింది నాసా.
తోకచుక్క రాకతో.. దుష్ప్రభావాలు సంభవిస్తాయని కొందరు పండితులుజోస్యం చెబుతున్నారు. తోకచుక్క కనపడిన మార్గంలో.. దాని తోక ఆధారంగా ఎన్ని డిగ్రీల అక్షాంశరేఖపై పడిందో.. అన్ని డిగ్రీల కోణంలో ఉన్న భూ భాగాల్లో ఆకస్మిక విషాద సంఘటనలు జరుగుతాయని, ఆయా ప్రాంతాల్లో ప్రముఖుల మరణం లేదా యుద్దం లేదా ప్రకృతి వినాశనం జరుగుతుందని చెబుతున్నారు.
చిన్న నగరమంతటి వ్యాసార్థం కలిగిన.. ఈ తోకచుక్కను 2022 మార్చిలో కనిపెట్టారు. భూమికీ- అంగారకుడికీ మధ్యలో గంటకి రెండు లక్షల ఏడు వేల కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకుపోతోంది.
హేలీ అనే తోక చుక్క 1910 కనిపిస్తే.. ఆ తర్వాత 1985లో భూమికి సమీపంగా వచ్చింది. మళ్లీ 75 ఏళ్ల తర్వాత కనిపిస్తుంది. 2020లో కనువిందు చేసిన నియోవైజ్ తోకచుక్క.. మళ్లీ ఆరు వేల ఏళ్ల తర్వాతే వస్తుంది. తోక చుక్కలు చాలా వరకు నెప్ట్యూట్ ఆవలి క్యూపియర్ బెల్టులో అంతకన్నా దూరంగా ఉండే ఊర్ట్ బెల్ట్‌లో ఉంటాయి. తోక చుక్క మధ్య భాగాన్ని కోమా అంటారు. ఇది ఒక రకంగా గడ్డకట్టిన మంచులాంటిది.
క్యూపియర్ బెల్ట్ నుంచి బయటకు రానంత వరకు తోకచుక్కలు మంచుగడ్డలాంటివే. అయితే అక్కడి నుంచి సూర్యుడి సమీపంలోకి వస్తున్నకొద్దీ కొంత మంచు కరిగి వాయువుగా మారడం మొదలవుతుంది. ఇది దుమ్ము రేణువులతో కలిసిపోయి కోమా చుట్టూ మేఘంలా ఏర్పడుతుంది.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..