Rock Salt For Health: కీళ్ల నొప్పులు, బీపీతో బాధపడుతున్నారా..? ఈ ఉప్పును తింటే మీ సమస్యలు మటుమాయమే..!
మనం తినే ఆహారంలో ఉప్పు లేకపోతే అసలు తినలం. ఇక తినే ఆహారంలో ఉప్పు ఉండే దాని రుచి రెట్టింపు అయినట్లే. అయితే మనం తినే ఉప్పు శరీర ఆరోగ్యంపై..
మనం తినే ఆహారంలో ఉప్పు లేకపోతే అసలు తినలం. ఇక తినే ఆహారంలో ఉప్పు ఉండే దాని రుచి రెట్టింపు అయినట్లే. అయితే మనం తినే ఉప్పు శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని మీకు తెలుసా..? అవును, అతిగా లేదా తక్కువగా ఉప్పు తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఉప్పును కేవలం తగిన మోతాదులో వినియోగిస్తేనే శరీరానికి అయోడిన్ ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఉప్పు మన బ్రెయిన్ పనితీరును మెరుగు పరచడమే కాక చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. ఆధునిక జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది హైబీపీ, కిడ్నీ సమస్యలు, గుండె సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఉప్పును అతిగా తినడం వల్లేనని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఉప్పుకు బదులుగా రాక్ సాల్ట్(కల్లుప్పు)ను తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. మరి కల్లుప్పును తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కీళ్ల నొప్పు: రాక్ సాల్ట్‌లో వుండే మినరల్స్ కీళ్ల నొప్పి, తిమ్మిరిల నుంచి ఉపశమనం పొందడానికి కూడా సహాయపడతాయి. అంతేకాకుండా కాళ్ళు దృడంగా ఉంచడానికి కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి ఈ మినరల్స్.
జీర్ణక్రియ: మలబద్ధక సమస్యలతో బాధపడుతున్నవారు రాక్ సాల్ట్‌ను తమ నిత్య ఆహారంలో వాడడం వల్ల అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తరచుగా పొట్ట సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
బ్లడ్ ప్రెషర్: గుండెకు సంబందించిన సమస్యలతో బాధపడుతున్న వారికి రాక్ సాల్ట్ ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు అధిక కొలెస్ట్రాల్ కూడా తగ్గించడమేకాకుండా గుండె పోటు సమస్యలను తగ్గిస్తుంది. ప్రతి రోజూ ఆహారంలో రాక్ సాల్ట్ తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ కూడా అదుపులో ఉంచుతుంది.
గొంతు నొప్పి: ఆయుర్వేదంలో రాక్ సాల్ట్‌కు చాలా ప్రధాన్యత ఉంది. తీవ్ర గొంత నొప్పి వచ్చినప్పుడు చిటికెడు వాపు, రాక్ సాల్ట్‌ను గోరువెచ్చని నీటిలో కలిపి పుక్కిలించడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అంతేకాకుండా సీజనల్ వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి