Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pistachios Benefits: పిస్తా పప్పులతో ఇన్ని రకాల ప్రయోజనాలా..? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

మన ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో పిస్తా కూడా ఒకటి. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంతో పాటు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో..

Pistachios Benefits: పిస్తా పప్పులతో ఇన్ని రకాల ప్రయోజనాలా..? తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Pistachios Side Effects
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 02, 2023 | 7:30 AM

మన ఆరోగ్యానికి మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో పిస్తా కూడా ఒకటి. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంతో పాటు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు, విటమిన్లు A, K, C, B-6, D, E, ప్రోటీన్, కాల్షియం, మాంగనీస్, ఫోలేట్, ఇతర డ్రై ఫ్రూట్స్ కంటే తక్కువ కొవ్వు, కేలరీలు ఉంటాయి. దీనిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పిస్తా పప్పులను సాయంత్రం వేళ అల్పాహారంగా కూడా తినవచ్చు. దీనిలోని పోషకాల కారణంగా దీనిని నిత్యం తినమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. మరి పిస్తా పప్పుల వల్ల కలిగే ప్రయోజనాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. జ్ఞాపకశక్తి: ఈ రోజుల్లో మతిమరుపు చాలా సాధారణం అయిపోయింది. పిస్తా పప్పుతో కొంతవరకు దీనిని అదుపులో ఉంచవచ్చు. ఇందులో చాలా ఖనిజాలు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. మరింత చురుకుగా చేస్తాయి. పిస్తా తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
  2. గుండె ఆరోగ్యం: పిస్తా తినడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజూ కొన్ని పిస్తాపప్పులను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. గుండెను అన్ని ప్రమాదాల నుంచి కాపాడుతుంది. అందుకే ఇది గుండెకు అనుకూలమైన ఆహారాలలో ఒకటిగా పరిగణిస్తారు.
  3. క్యాన్సర్ ప్రమాద నివారిణి: పిస్తా తినడం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. క్యాన్సర్ నిరోధకంలో సహాయకారిగా పరిగణించే పిస్తాపప్పులో యాంటీ కార్సినోజెనిక్ మూలకాలు కనిపిస్తాయి. ఇవి క్యాన్సర్‌ని నివారించేందుకు తోడ్పడుతాయి.
  4. ఎముకల బలోపేతం: బలమైన ఎముకలకు విటమిన్ డి, కాల్షియం అవసరం. ఈ రెండు పిస్తాపప్పులో ఉంటాయి. అటువంటి పరిస్థితిలో దీని రోజువారీ వినియోగం ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకలకు సంబంధించిన అన్ని వ్యాధుల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. కంటి ఆరోగ్యం: కళ్ళు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. వీటి ద్వారానే మనం ప్రపంచాన్ని చూస్తాం కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచడం చాలా ముఖ్యం. కంటికి మేలు చేసే A, E విటమిన్లు పిస్తాపప్పులో ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..