AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: ఈ ఆకులను తీసుకుంటే.. షుగర్ లెవెల్స్ 500 ఉన్నా 90 కి దిగిరావాల్సిందే.. ఎలా తినాలంటే..

ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు సర్వసాధారణమైపోయాయి. చాలా మంది చిన్ననాటి నుంచి డయాబెటీస్, బీపీ, అల్సర్స్, కీళ్ల నొప్పులు వంటి పలు అనారోగ్య సమస్యలతో..

Diabetes: ఈ ఆకులను తీసుకుంటే.. షుగర్ లెవెల్స్ 500 ఉన్నా 90 కి దిగిరావాల్సిందే.. ఎలా తినాలంటే..
Leaves For Diabetes
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 02, 2023 | 7:55 AM

Share

ప్రస్తుత కాలంలో ఆరోగ్య సమస్యలు సర్వసాధారణమైపోయాయి. చాలా మంది చిన్ననాటి నుంచి డయాబెటీస్, బీపీ, అల్సర్స్, కీళ్ల నొప్పులు వంటి పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల చాలా మంది మధుమేహం వంటి తీవ్ర వ్యాధులు కూడా వస్తున్నాయి. అయితే మధుమేహం సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో చక్కెర పరిమాణాలు పెరగడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అందువల్ల మధుమేహంతో, డయాబెటిస్‌ లక్షణాలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ వ్యాధితో బాధపడేవారు తాము తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు మధుమేహం ప్రాణాంతకంగానూ మారే అవకాశాలున్నాయి.

అయితే కొన్ని రకాల జాగ్రత్తలు, ఆహారపు నియమాలు పాటించడం వల్ల మధుమేహం సమస్యను నియంత్రించవచ్చు. షుగర్ లెవెల్స్‌ను కూడా నియంత్రించి నిశ్చింతగా జీవించవచ్చు. అందుకోసం కొన్ని రకాల ఔషధ గుణాలున్న ఆకులను తీసుకుంటే సరిపోతుంది. ఈ ఆకులలోని ఔషధ గుణాలు శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రించి ఎంతగానో మేలు చేస్తాయి. మరి అందుకోసం ఏయే ఆకులను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వేప ఆకులు: వేప ఆకుల్లో ఫ్లేవనాయిడ్స్, యాంటీ వైరల్ సమ్మేళనాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాబట్టి రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రించుకోవడానికి వేప ఆకులను ఎండబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీ జార్‌లో వేసి పౌడర్‌గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న పౌడర్‌ను ప్రతి రోజు ఒక చెంచ తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మామిడి ఆకులు: మామిడి కాయలు కాకుండా మామిడి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదిని ఆయుర్వేద నిపుణులు పేర్కోన్నారు. మధుమేహాన్ని నియంత్రించేందుకు ఈ ఆకులు కూడా దోహదపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే దీని కోసం 10 నుంచి 15 మామిడి ఆకులను తీసుకోవాలి. వాటిని నీటిలో వేసి బాగా మరిగించి.. ఆ తర్వాత రోజు వడకట్టి తాగాడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రలో ఉంటాయి.

మెంతి ఆకులు: మెంతికూరను ఆయుర్వేదంలో ఔషధంగా పరిగణిస్తారు. అందుకే ఆయుర్వేద నిపుణులు మెంతి ఆకులను మధుమేహ ఉన్నవారు ప్రతి రోజూ తీసుకోవాలని సూచిస్తారు. ఇందుకోసం మెంతి ఆకులను కూరగాయ లేదా సలాడ్‌గా చేర్చుకుని ప్రతి రోజూ తింటే రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి.

కరివేపాకు: కరివేపాకులో యాంటీ డయాబెటిస్‌ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు ప్రతి రోజూ ఈ ఆకులను ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా కళ్లకు కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది.

గమనిక: ఈ వ్యాసంలోని సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇచ్చినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సలహాను పాటించే ముందు వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం

రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో