Telugu News » Photo gallery » Add these food items to your pre workout diet for instant energy and see for more details
Pre Workout Diet: తక్షణ శక్తి కోసం వర్కవుట్స్‌కు ముందు తీసుకోదగిన ఆహారాలివే.. తింటే బ్రేక్ కూడా అవసరం ఉండదు..
శివలీల గోపి తుల్వా |
Updated on: Feb 01, 2023 | 6:15 AM
శారీరక దారుఢ్యం కోసం వర్కవుట్స్ చేస్తుంటారు చాలా మంది. అయితే హెవీ వర్కవుట్స్ చేసే ముందు ఆరోగ్యకర ఆహార పదార్థాలను తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. ఆ క్రమంలో మీరు మీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోవచ్చు.
Feb 01, 2023 | 6:15 AM
శారీరక దారుఢ్యం కోసం వర్కవుట్స్ చేస్తుంటారు చాలా మంది. అయితే హెవీ వర్కవుట్స్ చేసే ముందు ఆరోగ్యకర ఆహార పదార్థాలను తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది.
1 / 6
తినాలి కదా అని ఏదిపడితే అది తినకూడదు. ఇంకా ఈ క్రమంలో మీరు వర్కవుట్స్‌కు ముందు మీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను చేర్చుకోవచ్చు. ఇంకా ఏయే పదార్థాలను వర్కవుట్స్ చేసే ముందు తినవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
2 / 6
అరటిపండ్లు: అరటిపండులో కార్బోహైడ్రేట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యాయామ సమయంలో మీ శరీరానికి కావలసిన శక్తిని అందించడమే కాక మీ పనితీరును మెరుగుపరుస్తాయి. ఇంకా ఇవి మీ శరీరంలోని కొవ్వును శక్తిగా మారుస్తాయి. అంతేకాక మీ జీర్ణవ్యవస్థను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.
3 / 6
డ్రై ఫ్రూట్స్: డ్రై ఫ్రూట్స్‌లో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే ఇందులో కొంత మొత్తంలో కార్బోహైడ్రేట్లు కూడా ఉంటాయి. ఇవి ఎనర్జీ లెవల్స్‌ను పెంచడానికి పని చేస్తాయి. మీరు ఓట్స్‌తో కలిపిన డ్రై ఫ్రూట్స్‌ని కూడా వర్కవుట్స్‌కు ముందు తీసుకోవచ్చు.
4 / 6
పండ్లు- గ్రీక్ పెరుగు: పండ్లు, గ్రీక్ పెరుగు కలయిక ఆరోగ్యానికి చాలా మంచిది. పండ్లు కార్బోహైడ్రేట్లకు అద్భుతమైన మూలం.. గ్రీకు పెరుగు ప్రోటీన్‌కు మంచి వనరులు. వ్యాయమానికి ముందు వీటిని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
5 / 6
పీనట్ బటర్ టోస్ట్: మీరు పీనట్ బటర్ టోస్ట్‌ని కూడా ప్రీ-వర్కౌట్ స్నాక్‌గా తినవచ్చు. ఇందులో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు మంచి మొత్తంలో ఉంటాయి. ఇందులో విటమిన్ బి6, మెగ్నీషియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి.