Poco M4 Pro: భారత మార్కెట్లోకి పోకో కొత్త ఫోన్.. రూ. 15వేల లోపు అదిరిపోయే ఫీచర్లు..
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్‌ల (Smartphones) హవా నడుస్తోంది. రోజుకో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తున్నాయి స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు..
Poco M4 Pro: ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్‌ల (Smartphones) హవా నడుస్తోంది. రోజుకో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తున్నాయి స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో (Poco) కూడా కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. పోకో ఎమ్4 ప్రో పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. 4జీ టెక్నాలజీతో పనిచేసే ఈ ఫోన్‌లో మంచి ఫీచర్లను అందించారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు ఏంటి.? ధర ఎంత లాంటి వివవరాలు మీకోసం…
* ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.43 ఇంచ్ సూపర్ ఏఎంవోఎల్ఈడీ డిస్‌ప్లే, 180 హెచ్‌జెడ్ టచ్ సాంప్లింగ్ రేట్, 90 హెడ్జ్ రీఫ్రెష్ రేట్‌ను అందించారు.
* ఏఎంవోఎల్ఈడీ ప్యానెల్, 4జీ చిప్, స్టీరియో స్పీకర్స్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, ఐపీ53 రేటింగ్ లాంటి ఫీచర్లు ఈ ఫోన్‌కు ఉన్న అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు.
* మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
* కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 64 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.
* ఈ స్మార్ట్‌ఫోన్‌ను మొత్తం మూడు వేరియంట్లలో విడుదల చేశారు. ధర విషయానికొస్తే 6 జీబీ, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 14,999, 6జీబీ, 128 జీబీ ధర రూ. 16,499, 8 జీబీ, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 17,999గా ఉంది. మార్చి 7 నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభం కానున్నాయి.