Dizo Watch 2 Sports: భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ వాచ్ వచ్చేస్తోంది.. ఆకట్టుకుంటోన్న ఫీచర్లు..
Dizo Watch 2 Sports: ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయాన్ని తెలియజేసే ఒక గ్యాడ్జెట్ కానీ ఇప్పుడు వాచ్‌కు అర్థమే మారిపోయింది. స్మార్ట్ వాచ్‌లు..
Dizo Watch 2 Sports: ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయాన్ని తెలియజేసే ఒక గ్యాడ్జెట్ కానీ ఇప్పుడు వాచ్‌కు అర్థమే మారిపోయింది. స్మార్ట్ వాచ్‌లు (Smart Watch) అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా వాచ్‌లు స్మార్ట్‌గా మారిపోయాయి. ఇక ఈ వాచ్‌ల అమ్మకాలు కూడా భారీగా పెరగడంతో చాలా వరకు టెక్ కంపెనీలు స్మార్ట్ వాచ్‌లను తయారు చేస్తూ వస్తున్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని టెక్ దిగ్గజాలు స్మార్ట్ వాచ్‌లను తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా రియల్ మీ టెక్‌లైఫ్ భాగస్వామి డిజో కూడా కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేస్తోంది. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఈ వాచ్‌ను భారత్‌లో లాంచ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ వాచ్‌లో ఉండే ఫీచర్లపై ఓ లుక్కేయండి..
* ఈ స్మార్ట్ వాచ్‌లో ఏకంగా 110కిపైగా స్పోర్టస్ మోడ్స్‌ను అందిస్తున్నారు. వాటర్ ప్రూఫ్ ఈ వాచ్ మరో ప్రత్యేకత.
* ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్టులో ఈ వాచ్ అందుబాటులోకి రానుంది. ఈ వాచ్‌లో 1.69 ఇంచెస్ టచ్ స్క్రీన్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు.
* ఇక 150కి పైగా వాచ్ ఫేసెస్, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, హై రిఫ్రెష్ రేట్ ఈ వాచ్ ప్రత్యేకతలు.
* వీటితో పాటు ఈ వాచ్‌లో ఎస్‌పీఓ 2 ట్రాకింగ్, హార్ట్‌రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్, స్టెప్ కౌంటర్, కాలరీ ట్రాకర్, వాటర్ డ్రింక్ రిమైండర్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
* ఇక ఈ స్మార్ట్ వాచ్‌ను వాటర్ రెసిస్టెంట్‌తో అందించారు. నీటిలో 50 మీటర్ల లోతు వెళ్లినా ఈ వాచ్ పని చేస్తుంది.
* బ్యాటరీ విషయానికొస్తే ఈ వాచ్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 10 రోజుల పాటు వస్తుంది. కేవలం రెండు గంటల్లో ఫుల్ చార్జింగ్ అవుతుంది.