Sleeping: వయసు పెరిగే కొద్దీ నిద్రలేమి సమస్య ఎందుకు వస్తుంది? పరిశోధనలలో కీలక విషయాలు

Sleeping: సాధారణగా వయసు ఎక్కువగా ఉన్నవారికి నిద్రపోరు. ఇతరులకంటే వృద్ధుల నిద్ర తక్కువగా ఉంటుంది. పెరుగుతున్న వయస్సులో వృద్ధులకు ఇలా ఎందుకు జరుగుతుంది..

Sleeping: వయసు పెరిగే కొద్దీ నిద్రలేమి సమస్య ఎందుకు వస్తుంది? పరిశోధనలలో కీలక విషయాలు
Follow us
Subhash Goud

|

Updated on: Mar 01, 2022 | 11:04 AM

Sleeping: సాధారణగా వయసు ఎక్కువగా ఉన్నవారికి నిద్రపోరు. ఇతరులకంటే వృద్ధుల నిద్ర తక్కువగా ఉంటుంది. పెరుగుతున్న వయస్సులో వృద్ధులకు ఇలా ఎందుకు జరుగుతుంది. అమెరిక (America) శాస్త్రవేత్తలు ఈ రహస్యాన్ని చాలా వరకు ఛేదించారు. కారణాన్ని కూడా చెప్పారు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి, ఒక వ్యక్తి నిద్ర-మేల్కొనే స్థితిని నియంత్రించే మెదడులోని భాగం వయస్సుతో ఎలా బలహీనపడుతుందో కనుగొన్నారు. వృద్ధులలో నిద్రలేమి సమస్యను అధిగమించేందుకు మందులు ఇస్తారు. వయస్సుతో ఈ మందుల ప్రభావం తగ్గడం ప్రారంభమవుతుంది. అయితే న్యూరాన్ల ద్వారా విడుదలయ్యే మెదడులోని కొన్ని భాగాలలో ప్రత్యేక రసాయనాలు హైపోక్రెటిన్లు కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఈ రసాయనం తగ్గిపోయి నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు ఎక్కువవుతాయి.

వృద్ధాప్యంలో నిద్ర లేమి సమస్యను గుర్తించడానికి అమెరికన్ శాస్త్రవేత్తలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. ఇందుకోసం ఎలుకల రెండు బృందాలను చేశారు. మొదటి సమూహంలో 3 నుండి 5 నెలల వయస్సు, రెండవ సమూహం 18 నుండి 22 నెలల వయస్సు గల ఎలుకలు ఉన్నాయి. మెదడులోని న్యూరాన్లు కాంతిని ఉపయోగించి ప్రేరేపించారు. దీని తర్వాత ఇమేజింగ్ టెక్నిక్‌లతో మెదడును పరిశీలించారు. విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్న ఎలుకల కంటే పెద్ద ఎలుకలు 38 శాతం ఎక్కువ హైపోక్రెటిన్‌లను కోల్పోయాయని నివేదిక వెల్లడించింది.

పరిశోధన ఫలితాల సహాయంతో నిద్రలేమి సమస్యను అధిగమించేందుకు మెరుగైన ఔషధాలను సిద్ధం చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వయస్సుతో ఔషధాల తగ్గుదల ప్రభావాన్ని నియంత్రించవచ్చు. వృద్ధులలో నిద్రలేమి సమస్యను ఎలా అధిగమించాలి అనే విషయాలను కొనుగోన్నారు శాస్త్రవేత్తలు. పరిశోధకుడు లూయిస్ డి లెసియా మాట్లాడుతూ.. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు తమకు మంచి నిద్ర రాదని చెప్పారు. మనిషి నిద్ర కూడా అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం, డిప్రెషన్ వంటి వ్యాధులకు దారితీస్తుందని గుర్తించారు.

ఇవి కూడా చదవండి:

శరీరంలో ఇలాంటి ప్రమాదకర లక్షణాలు కనిపిస్తున్నాయా ?.. అయితే మీకు ఆ విటమిన్ లోపం ఉన్నట్లే..

Breast Milk: ఆ రాష్ట్రంలో చికిత్సలేని వ్యాధి బారిన పడుతున్న మహిళలు.. అమ్మపాలు ప్రమాదకరంగా మారాయి అంటున్న పరిశోధకులు